iQOO Neo 6 : iQOO నుంచి ఫస్ట్ నియో సిరీస్ 5G ఫోన్.. ఇండియాలో ధర ఎంతంటే?

iQOO Neo 6 : భారత మార్కెట్లోకి iQOO నుంచి ఫస్ట్ నియో సిరీస్ లాంచ్ అయింది. iQOO Neo 6 స్మార్ట్ ఫోన్ 5G సపోర్టుతో వస్తుంది. iQOO Neo 6 మిడిల్-రేంజ్‌తో వచ్చింది.

iQOO Neo 6 : iQOO నుంచి ఫస్ట్ నియో సిరీస్ 5G ఫోన్.. ఇండియాలో ధర ఎంతంటే?

Iqoo Neo 6 With Snapdragon 870 5g Launched In India, Price Starts At Rs 29,999 (1)

iQOO Neo 6 : భారత మార్కెట్లోకి iQOO నుంచి ఫస్ట్ నియో సిరీస్ లాంచ్ అయింది. iQOO Neo 6 స్మార్ట్ ఫోన్ 5G సపోర్టుతో వస్తుంది. iQOO Neo 6 మిడిల్-రేంజ్‌తో వచ్చింది. నియో సిరీస్‌లో ఇదే ఫస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. మోస్ట్ పవర్‌ఫుల్ కూడా. నియో 6ని పవర్‌ఫుల్ ప్రాసెసర్ డివైజ్‌ యూజర్లను మరింత ఆకట్టుకోనుంది. Neo 6 Qualcomm Snapdragon 870 5G ప్రాసెసర్‌తో పాటు 12GB RAMతో పనిచేస్తుంది. నియో 6 హార్డ్‌కోర్ గేమర్స్ కోసం ఇంటర్నల్‌గా అమర్చారు. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రో సిరీస్‌కు సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.62-అంగుళాల AMOLED పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. Samsung GW1P సెన్సార్‌తో 64-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

iQOO Neo 6: ఇండియాలో ధర ఎంతంటే? :
iQOO Neo 6 (8GB+128GB) ధర రూ. 29,999, (12GB+256GB) వేరియంట్‌ ధర రూ. 33,999 అందుబాటులో ఉండనుంది. iQOO Neo 6, Amazon.inలో 31 మే, 2022 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. iQOO ఈ-స్టోర్ డార్క్ నోవా సైబర్ రేజ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. అదనంగా, బ్రాండ్ నియో 6లో రెండు ఏళ్ల ఆండ్రాయిడ్, మూడు ఏళ్ల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లు, అమెజాన్ డిస్కౌంట్ సహా ధర రూ. 25,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. మీరు మీ ICICI క్రెడిట్ కార్డ్‌ ద్వారా పేమెంట్ చేస్తే.. రూ. 3000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Iqoo Neo 6 With Snapdragon 870 5g Launched In India, Price Starts At Rs 29,999

Iqoo Neo 6 With Snapdragon 870 5g Launched In India, Price Starts At Rs 29,999

iQOO Neo 6: స్పెసిఫికేషన్‌లు ఇవే :
iQOO Neo 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.62-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. iQOO Neo 6 Qualcomm Snapdragon 870 5Gతో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పొందవచ్చు. ఈ ఫోన్ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 2.0తో కూడా రానుంది. 4G ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో వస్తుంది. 8GB RAMని 12GB, 12GB RAMని 16GB వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. కెమెరా విభాగంలో.. iQOO Neo 6 ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తోంది. ఇందులో GW1P సెన్సార్‌తో 64 MP OIS మెయిన్ కెమెరా, 8MP వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP కెమెరాను అందిస్తోంది.

iQOO Neo 6 స్మార్ట్ ఫోన్.. iQOO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిపున్ మరియా మాట్లాడుతూ.. నియో 6 లాంచ్‌తో భారత మార్కెట్లో సరికొత్త నియో సిరీస్‌ను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. నియో సిరీస్ నుంచి ఇదే ఫస్ట్ పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ అన్నారు. సెగ్మెంట్-లీడింగ్ పెర్ఫార్మెన్స్‌తో, రిఫ్రెష్ డిజైన్‌తో గేమింగ్ కెపాసిటీ కలిగిన కెమెరాతో అందిస్తున్నామని చెప్పారు. హై-పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యూజర్లకు అద్భుతమైన గేమింగ్ అనుభవంతో పాటు మెరుగైన కెమెరా ఫీచర్‌లను ఈ స్మార్ట్ ఫోన్ అందిస్తుందని తెలిపారు.

Read Also : iQOO Neo 6 5G : iQOO Neo 6 వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?