Realme C53 Price Cut : రియల్‌మి C53 ఫోన్ ధర తగ్గిందోచ్.. కేవలం రూ.2,550 మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Realme C53 Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్‌మి C53 ధర భారీగా తగ్గింది. కేవలం రూ. 2,550కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Realme C53 Price Cut : రియల్‌మి C53 ఫోన్ ధర తగ్గిందోచ్.. కేవలం రూ.2,550 మాత్రమే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

Realme C53 Price Cut _ Realme C53 6GB RAM Price drops with 15 percent discount

Realme C53 Price Cut : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) సరికొత్త ఫోన్ (Realme C53)పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రియల్‌మి ఫోన్‌‌పై ఈ అద్భుతమైన ఆఫర్‌ను ఇ-కామర్స్ సైట్‌ (Flipkart) అందిస్తోంది. ఇప్పుడు ఈ రియల్‌మి C53 ఫోన్ రూ.12,999కి బదులుగా రూ.10,999గా సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి C53 మంచి 15శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.10,450 వరకు ఆదా చేయవచ్చు.

Read Also : Apple iPhone 11 Discount : ఆపిల్ ఐఫోన్ 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

రియల్‌మి C53 స్పెసిఫికేషన్స్ :
రియల్‌మి C53 ఫోన్ 6.74-అంగుళాల IPS LCD స్క్రీన్ 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ పైభాగంలో 260 PPI వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే స్క్రీన్ అన్ని వైపులా సన్నని బెజెల్స్‌తో వస్తుంది. 560 నిట్‌ల ప్రకాశం, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ 1.8GHz Unisoc T612 CPU, Mali-G57 GPU రియల్‌మి C53ని అమలు చేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM ఉన్నాయి.

Realme C53 Price Cut _ Realme C53 6GB RAM Price drops with 15 percent discount

Realme C53 Price Cut _ Realme C53 6GB RAM Price drops with 15 percent discount

రియల్‌మి C53 వెనుక, 2 కెమెరాలు ఉన్నాయి. కెమెరా మాడ్యూల్‌లో f/1.79 ఎపర్చరు, 11080p వీడియో రికార్డింగ్ సామర్థ్యాలతో 50MP ప్రైమరీ కెమెరా వచ్చింది. ప్రాథమిక 50MP కెమెరాతో పాటు 0.3MP డెప్త్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు రియల్‌మి C53 ఫోన్ f/2.0 ఎపర్చర్‌తో 5MP కెమెరాను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : OnePlus 11 5G Discount : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!