iPhone Users Alert : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. iOS అప్‌డేట్‌లో కొత్త బగ్.. Face ID ఫీచర్ పనిచేయడం లేదట.. ఓసారి చెక్ చేసుకోండి!

iPhone Users Alert : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీరు ఐఓఎస్ అప్‌డేట్ (iOS Update) అప్‌గ్రేడ్ అయ్యారా? చాలామంది ఐఫోన్ యూజర్లు Face ID ఫీచర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. iOS 15.7.1 అప్‌గ్రేడ్ తర్వాత చాలా మంది ఐఫోన్లలో Face IDతో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

iPhone Users Alert : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. iOS అప్‌డేట్‌లో కొత్త బగ్.. Face ID ఫీచర్ పనిచేయడం లేదట.. ఓసారి చెక్ చేసుకోండి!

Some iPhone users are unable to use Face ID after iOS 15.7.1 upgrade

iPhone Users Alert : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీరు ఐఓఎస్ అప్‌డేట్ (iOS Update) అప్‌గ్రేడ్ అయ్యారా? చాలామంది ఐఫోన్ యూజర్లు Face ID ఫీచర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. iOS 15.7.1 అప్‌గ్రేడ్ తర్వాత చాలా మంది ఐఫోన్లలో Face IDతో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నివేదికల ప్రకారం.. iOS 15.7.1లోని కొత్త బగ్ కారణంగానే ఐఫోన్‌లలో Face ID పనిచేయకపోవడానికి కారణమవుతోంది. MacRumours ప్రకారం.. యూజర్లు తమ డివైజ్‌లలో Face IDని రీసెట్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ ఐఫోన్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ‘Face ID not Available’ ఎర్రర్‌ మెసేజ్ వస్తోంది. iPhone 12Pro, iPhone 13Pro మోడల్‌లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయని నివేదిక వెల్లడించింది. ఈ కొత్త బగ్ ఇతర డివైజ్‌లపై కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Apple ఇంకా బగ్ సమస్యను గుర్తించలేదు. బగ్‌ను సమస్యను ఫిక్స్ చేసే కొత్త అప్‌డేట్ కూడా రిలీజ్ చేయలేదు. చాలా డివైజ్‌లు iOS 15కి సపోర్టు చేసేలా ఉన్నాయి. కానీ, iOS 16కి సపోర్టు చేసేలా లేవు. iPhone 6, 6s, మొదటి జనరేషన్ iPhone SE, సెవన్త్ జనరేషన్ iPod టచ్, iPhone 7, iPhone 7 Plus అన్నీ అనుకూలంగా ఉంటాయి iOS 15 కానీ iOS 16తో కాదు.

Some iPhone users are unable to use Face ID after iOS 15.7.1 upgrade

Some iPhone users are unable to use Face ID after iOS 15.7.1 upgrade

గతంలో రిలీజ్ చేసిన వెర్షన్‌తో కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు Apple ఇటీవల iOS 16.1ని రిలీజ్ చేసింది. బగ్ సమస్యలతో పాటు, ఆపిల్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేసింది. iOS 16 అప్‌డేట్ తర్వాత.. బ్యాటరీ శాతం కొత్త iPhoneలకు తిరిగి వచ్చింది. iPhone XR, iPhone 11, iPhone 12 mini, iPhone 13 miniలలో అందుబాటులో లేదు. లేటెస్ట్ బీటా అప్‌డేట్ ఈ ఐఫోన్‌లకు ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫీచర్ స్థిరమైన వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుందని భావించవచ్చు.

iOS 16 అప్‌డేట్‌తో, ఆపిల్ కొత్త ఐఫోన్‌లకు బ్యాటరీ పర్సంటేజ్ తిరిగి తీసుకొచ్చింది. ఇంతకుముందు, ఈ ఫీచర్ కొత్తగా రిలీజ్ చేసిన ఐఫోన్లలో మాత్రమే లిమిట్ చేసింది. అయితే iOS 16కి కొత్త అప్‌డేట్, iPhone XR, iPhone 11, iPhone 12 mini, iPhone 13 miniలలో ఫీచర్‌ను తీసుకువచ్చింది. బ్యాటరీ పర్సంటేజ్ ఫీచర్ విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. మీరు కూడా ఫీచర్ వద్దని భావిస్తే.. డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకోసం Settings> Battery> Battery Percentage ON/OFF చేయండి. iPhone 8, అంతకంటే ఎక్కువ ఉన్న పాత iPhoneలు iOS 16కి అనుకూలంగా ఉంటాయి. ఐఫోన్ చెక్ చేసేందుకు మీరు Settings > General> Software Updates అని ఉంటుంది. iOS 16 ఐఫోన్‌లకు ఒక మెయిన్ అప్‌డేట్ లాక్ స్క్రీన్‌ను తీసుకురానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple Watch : 12ఏళ్ల బాలిక లైఫ్ సేవ్ చేసిన ఆపిల్ వాచ్.. హై హార్ట్ రేట్ అలర్ట్ చేసింది.. బాలికకు క్యాన్సర్ ఉందని తేలింది..!