Apple Watch : 12ఏళ్ల బాలిక లైఫ్ సేవ్ చేసిన ఆపిల్ వాచ్.. హై హార్ట్ రేట్ అలర్ట్ చేసింది.. బాలికకు క్యాన్సర్ ఉందని తేలింది..!

Apple Watch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ వాచ్ (Apple Watch) టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడూ కొత్త అప్‌డేట్ చేస్తోంది. ఆపిల్ వాచ్ ఫీచర్ల విషయంలోనూ అంతే అప్‌డేట్స్ అందిస్తోంది. ఆపిల్ వాచ్ టెక్నాలజీ మాత్రమే కాదు.. కొన్ని క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో వచ్చింది.

Apple Watch : 12ఏళ్ల బాలిక లైఫ్ సేవ్ చేసిన ఆపిల్ వాచ్.. హై హార్ట్ రేట్ అలర్ట్ చేసింది.. బాలికకు క్యాన్సర్ ఉందని తేలింది..!

A 12-year-old discovered she had cancer after Apple Watch alerted her about abnormally high heart rate

Apple Watch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ వాచ్ (Apple Watch) టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడూ కొత్త అప్‌డేట్ చేస్తోంది. ఆపిల్ వాచ్ ఫీచర్ల విషయంలోనూ అంతే అప్‌డేట్స్ అందిస్తోంది. ఆపిల్ వాచ్ టెక్నాలజీ మాత్రమే కాదు.. కొన్ని క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో వచ్చింది. ఆపిల్ వాచ్ చాలామంది వినియోగదారుల ప్రాణాలను లెక్కలేనన్ని సార్లు కాపాడింది. అయితే ఇప్పుడు ఒక 12ఏళ్ల బాలిక ప్రాణాలను రక్షించింది. బాలికలో అసాధారణ స్థాయిలో అధిక హృదయ స్పందన రేటు (High Heart Rate) గురించి వాచ్ ఆమెను హెచ్చరించింది.

వైద్యులు పరీక్షించగా.. ఆ బాలికకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. Apple వాచ్ హృదయ స్పందన నోటిఫికేషన్ ఫీచర్ అనేది Watch SE, Watch 7 కొత్తగా లాంచ్ అయిన Watch 8, Watch Ultra లో కూడా అందుబాటులో ఉంది. అవర్ డిట్రౌట్ ప్రకారం.. ఇమాని మైల్స్ అనే 12 ఏళ్ల బాలికలో అసాధారణంగా అధిక హృదయ స్పందన రేటు పెరగడాన్ని ఆపిల్ వాచ్ నిరంతరం డిటెక్ చేస్తోంది. ఆమె తల్లి, జెస్సికా కిచెన్ కూడా ఈ విషయంలో కంగారుపడింది. ఎందుకంటే ఇలా బాలిక విషయంలో ముందెన్నడూ జరగలేదు. జెస్సికా కిచెన్.. ఆపిల్ వాచ్ హెచ్చరికలతో ఆమె కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది.

A 12-year-old discovered she had cancer after Apple Watch alerted her about abnormally high heart rate

A 12-year-old discovered she had cancer after Apple Watch alerted her about abnormally high heart rate

ఆ తర్వాత అపెండిసైటిస్ కోసం ఇమానీకి ఆపరేషన్ చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆమె అపెండిక్స్‌లో న్యూరోఎండోక్రిన్ కణితి ఉందని వైద్యులు ఆమె తల్లికి తెలియజేశారు. ఇది పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. తదుపరి టెస్టుల అనంతరం ఇమానీ శరీరంలోని ఇతర భాగాలకు కణితి వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. ఆ క్యాన్సర్‌ను తొలగించేందుకు ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత అంతా బాగానే ఉందని బాలిక తల్లి తెలిపింది. ఆపిల్ వాచ్ అలర్ట్ చేయకపోతే.. మరికొన్నాళ్లు తర్వాత పాపను ఆసుపత్రికి తీసుకెళ్లేదని, అది బాలిక ప్రాణాంతకంగా మారిందని కిచెన్ చెప్పుకొచ్చింది.

A 12-year-old discovered she had cancer after Apple Watch alerted her about abnormally high heart rate

A 12-year-old discovered she had cancer after Apple Watch alerted her about abnormally high heart rate

వాచ్ అలర్ట్ చేసి ఉండకపోతే.. మరో కొన్నిరోజులు అలానే ఉండేవాళ్లమని, తీవ్రమైనప్పుడే బాలికను తీసుకువెళ్లి ఉండేవాళ్లమని కిచెన్ స్థానిక మీడియాతో చెప్పింది. ఇమానీ దగ్గర వాచ్ లేకుంటే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని వాపోయింది. Apple వాచ్‌లో ECG, హార్ట్ రేట్ నోటిఫికేషన్‌లు, ఫాల్, క్రాష్ డిటెక్షన్ వంటి అనేక ప్రాణాలను రక్షించే ఫీచర్‌లు ఉన్నాయి. ఇటీవల, ఆపిల్ వాచ్ ECG హార్ట్ సెన్సార్ దాదాపు 3వేల సార్లు తక్కువ రెస్ట్ హార్ట్ రేట్ ట్రాకింగ్ కోసం అలర్ట్ చేసింది. తద్వారా 57 ఏళ్ల యూకేలోని వ్యక్తి జీవితాన్ని ఆపిల్ వాచ్ కాపాడింది. డేవిడ్ తన భార్య బహుమతిగా ఇచ్చిన ఆపిల్ వాచ్ నుంచి అనేక అలర్ట్ పొందిన తర్వాత ఆసుపత్రికి వెళ్లాడు. తదుపరి పరీక్షలు, వైద్య పరీక్షల అనంతరం తనకు గుండెలో సమస్య ఉందని గుర్తించినట్టు తెలిపాడు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్