Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్

యాపిల్ వాచ్‌లో హెల్త్ ఫీచర్స్ అద్భుతంగా పని చేస్తాయి. ఈ వాచ్ హార్ట్ ఎటాక్‌ను ముందే గుర్తించడం ద్వారా చాలా మంది ప్రాణాల్ని కాపాడటంలో సాయపడింది. తాజాగా ఈ వాచ్ మరో ఘనత సాధించింది. ప్రెగ్నెన్సీని ముందుగానే గుర్తించింది.

Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్

Apple Watch: హెల్త్, బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాల్లో యాపిల్ వాచ్ ఎంత సమర్ధంగా పనిచేస్తుందో అనేకసార్లు రుజువైంది. ఈ వాచ్‌లో బోలెడన్ని హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా యూజర్లలో హార్ట్ ఎటాక్‌ను ముందే గుర్తించి అలర్ట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని కాపాడింది.

Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్.. బెయిల్ నిబంధనల సడలింపు పిటిషన్ కొట్టివేత

యాపిల్ వాచ్ సాధించిన విజయాల్లో తాజాగా మరో అంశం చేరింది. ఒక మహిళకు క్లినికల్ టెస్టుకు ముందే ప్రెగ్నెన్సీ రిపోర్టును వెల్లడించింది. అది కూడా నాలుగు వారాల గర్భం సమయంలోనే. ఈ విషయాన్ని సంబంధిత మహిళే వెల్లడించింది. 34 ఏళ్ల ఒక మహిళ తన అనుభవాన్ని రెడిట్‌లో షేర్ చేసుకుంది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు 15 రోజులపాటు హార్ట్ బీట్ పెరిగింది. సాధారణంగా ఆమె హార్ట్ బీట్ 57 ఉండేది. కానీ, కొద్ది రోజులపాటు 72కు పెరిగింది. దీంతో ఆమె అనుమానంతో అనేక జాగ్రత్తలు తీసుకుంది. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లి వర్కవుట్ చేయడం, డైట్ ఫాలో అవ్వడం వంటివి చేసింది. మరోవైపు తన 18 నెలల పాపకు పాలు కూడా పట్టేది.

BiggBoss 6 Day 35 : దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ.. బిగ్‌‌బాస్‌ నుంచి చలాకి చంటి అవుట్..

అయినప్పటికీ హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంది. మరోవైపు పీరియడ్స్ కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలో కోవిడ్ టెస్టు, ఇతర హెల్త్ చెకప్స్ చేయించుకుంది. కానీ, అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఈ క్రమంలో తనకు ప్రెగ్నెన్సీ సమయంలో కొన్నిసార్లు హార్ట్ బీట్ పెరుగుతుందనే విషయం తెలిసింది. దీంతో పరీక్షలు చేయించుకోగా ఈ విషయం నిర్ధరణ అయింది. అయితే, హార్ట్ బీట్ పెరగడం ద్వారా ఈ విషయాన్ని యాపిల్ వాచ్ ముందుగానే పసిగట్టిందని ఆమె తెలిపింది. అందువల్ల యూజర్లు తమ వాచ్‌లో ఇలాంటి హెల్త్ ఫీచర్స్ అప్‌డేట్ చేసుకోవాలని ఆమె సూచించింది.