Tesla Pi Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎలన్ మస్క్… టెస్లా నుంచి స్మార్ట్ ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే

ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. త్వరలోనే టెస్లా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతున్నాడు.

Tesla Pi Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎలన్ మస్క్… టెస్లా నుంచి స్మార్ట్ ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే

Updated On : October 17, 2022 / 7:22 PM IST

Tesla Pi Phone: ‘టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్‌లింక్, న్యూరాలింక్’ వంటి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవలే పర్‌ఫ్యూమ్ కూడా తీసుకొచ్చిన మస్క్ త్వరలో టెస్లా నుంచి స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతున్నాడు.

Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై కేసులు అక్రమం.. గొడవలు వైసీపీ పనే: పవన్ కల్యాణ్

వచ్చే డిసెంబర్‌లో ‘టెస్లా పై’ పేరుతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఫోన్ 120 రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. ఫోన్లో నాలుగు కెమెరాలుంటాయి. ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ కెపాసిటీతో మూడు రేర్ కెమెరాలు ఉంటాయి. ముందువైపు 40 ఎంపీ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ టెస్లా సొంత ప్రాసెసర్‌తో రూపొందుతోంది. ఈ ప్రాసెసర్ వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి. ఫోన్ బ్యాటరీ 5,000 ఎంఏహెచ్ పవర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హై ఎండ్ ఫోన్‌గానే మార్కెట్లోకి రానుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీని ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఉండొచ్చు.

Girl Child Died: ఏడాదిన్నర చిన్నారిని వదిలేసి బయటకు వెళ్లిన తల్లి.. నీళ్ల బకెట్‌‌లో పడి పాప మృతి

ఈ ఫోన్లో మరో ప్రత్యేకత.. నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కలిగి ఉండటం. అయితే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుందా? లేదా మరేదైనా ఓఎస్‌తో వస్తుందా? లేక టెస్లా సొంత ఓఎస్ తయారు చేస్తుందా అనే విషయాలు తెలియాలి.