Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలామంది ఫేస్ బుక్ అకౌంట్ వినియోగిస్తునే ఉంటారు. ఫేస్ బుక్ ప్రొఫైల్ కూడా తరచూ మార్చేస్తుంటారు.

Want To Know Who Just Viewed Your Facebook Profile Check Tips And Tricks Here
Facebook Profile Trick : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలామంది ఫేస్ బుక్ అకౌంట్ వినియోగిస్తునే ఉంటారు. ఫేస్ బుక్ ప్రొఫైల్ కూడా తరచూ మార్చేస్తుంటారు. కొత్త ఫొటోలను అప్ లోడ్ చేస్తుంటారు. అయితే.. కొంతమంది తమ ప్రొఫైల్ అందరూ యాక్సస్ చేయకుండా ఉండేలా లాక్ కూడా పెట్టేస్తుంటారు. అయితే మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ను మీ స్నేహితులతో పాటు మీకు స్నేహితులు కానివారు కూడా చూసే అవకాశం ఉంది.
ఎవరెవరూ మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ చూశారో తెలియకపోవచ్చు. అయితే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా సులభంగా మీ ప్రొఫైల్ ఎవరూ విజిట్ చేశారో వెంటనే తెలుసుకోవచ్చు. మీకు తెలిసినవాళ్లు మాత్రమే కాదు.. మీకు తెలియనివాళ్లు కూడా మీ ప్రొఫైల్ చెక్ చేస్తుంటారు. అలా ఎవరూ మీ ప్రొఫైల్ చెక్ చేశారు.. ఎంతమంది చూశారో ఇలా తెలుసుకోవచ్చు.
ముందుగా మీ ఫేస్ బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
అది డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ ఏదైనా కావొచ్చు..
మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పేజీపై మౌస్‌తో Right Click చేయాలి.
మీకు ఫేస్‌బుక్ సోర్స్ ‘View Page Source’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
పేజీ సోర్స్ ఓపెన్ చేసిన తర్వాత Ctrl+F కీబోర్డు బటన్లపై క్లిక్ చేయాలి.
సెర్చ్ బార్‌లో ‘BUDDY_ID’ అని టైప్ చేయాలి.
అప్పుడు అక్కడ ‘BUDDY_ID’ తో పాటు చాలా ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు డిస్ ప్లే అవుతాయి.
ఆ ఐడీలను అన్నింటిని కాపీ చేసుకోవాలి.
మీ బ్రౌజర్‌లో మరో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి.
‘Facebook.com/123456789123456’ అని టైపు చేయండి.
మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని చూసివాళ్ల ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది.
ఈ ఐడీల ఆధారంగా ఫేస్ బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వారి అకౌంట్లను చూడొచ్చు.
Read Also : Facebook : ఫేస్‌బుక్‌కి బిగ్ షాక్.. రూ.10లక్షల కోట్ల పరిహారం చెల్లించాలంటూ దావా