Bhadradri Kothagudem: ఇద్దరమ్మాయిలతో.. ఇద్దర్ని ఒకే ముహూర్తంలో పెళ్లాడిన యువకుడు ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఇద్దరు మహిళలను ఒకేవేదికపై ఒకే ముహూర్తానికి వివాహం చేసుకున్నాడు. ఇద్దరమ్మాయిలు ఇష్టపూర్వకంగా సత్తిబాబును పెళ్లిచేసుకోవటంతో గ్రామ పెద్దలు, గ్రామస్తులుసైతం అడ్డుచెప్పలేదు. దీంతో గురువారం వీరి వివాహం సజావుగా సాగింది.

Bhadradri Kothagudem: ఇద్దరమ్మాయిలతో.. ఇద్దర్ని ఒకే ముహూర్తంలో పెళ్లాడిన యువకుడు ..

Marriage

Bhadradri Kothagudem: పెళ్లికుమారుడు ఒక్కడే.. కానీ పెళ్లి కుమార్తెలు ఇద్దరు.. వారిద్దరికి ఒకే మండపంలో, ఒకే ముహూర్తానికి తాళికట్టేశాడు ఓ యువకుడు. అదేంటి అంటే.. ప్రేమించుకున్నాం.. విడివిడిగా ఉండలేం అనేశారు. దీంతో గ్రామ పెద్దలు, గ్రామస్తులుసైతం ఎవరూ అభ్యంతరం చెప్పకపోవటంతో వీరి వివాహం సజావుగా సాగింది.

Shocking Viral video : తగ్గేదేలే.. మెడలోతు వరద నీటిలోనూ వేగంగా దూసుకుపోతున్న బస్సు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు ఇద్దరు మహిళలను ఒకేవేదికపై ఒకే ముహూర్తానికి వివాహం చేసుకున్నాడు. వీరి గిరిజన సంప్రదాయాలు అందరితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. యువతి, యువకులు ఒకరినొకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేస్తారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సహజీవనం చేస్తున్న క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాతకూడా పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.

viral video : ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో : పాపకు వార్నింగ్ ఇచ్చిన కుక్క

సత్తిబాబు డిగ్రీ వరకు చదివి మధ్యలో ఆపేశాడు. సత్తిబాబు ఇంటర్ చదువుతున్న సమయంలో పక్క గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న స్వప్న కుమారిని ప్రేమించాడు. వరుసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్న కుమారికి ఒక పాప జన్మించగా, సునీతకు కూడా ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం మళ్లీ ఇద్దరూ గర్భం దాల్చారు. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును కోరగా ఇద్దరిని ప్రేమిస్తున్నానని, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని విషయం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ అవాక్ అయ్యారు. మూడూర్ల పెద్దల సమక్షంలో పంచాయితీచేసి ముగ్గురి ఇష్టఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వాళ్ల ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని పెద్దలుసైతం నిర్ణయించారు. అనుకున్న ముహూర్తం ప్రకారం.. బంధువులందరిని పిలిచి గురువారం ఉదయం కులపెద్దలు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరికీ సత్తిబాబు వివాహమాడాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.