Shocking Viral video : తగ్గేదేలే.. మెడలోతు వరద నీటిలోనూ వేగంగా దూసుకుపోతున్న బస్సు..
మెడలోతు వరద నీటిలోనూ వేగంగా దూసుకుపోతోంది ఓ బస్సు.ఏదో ఓ సాధారణ రోడ్డుపై దూసుకుపోయేంత స్పీడ్ లో కూడా ఫాస్టుగా డ్రైవ్ చేసిన ఈ డ్రైవర్ తగ్గేదేలేదన్నట్లుగా బస్సును నడిపేశాడు..

Metro Bus Speeding Through Deep Floodwater : న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు చెట్లు నేలకూలటంతో పాటు వరదలు వెల్లువెత్తాయి. వరదనీరు రోడ్లపై భారీగా చేరుకుంది. మెడలోతు నీరు నిలిచిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జనజీవన అస్తవ్యస్థంకావటమే కాదు వాహనాల రాకపోకలు నిలిచిపోతాయనే విషయం తెలిసిందే. కానీ ఆక్లాండ్ లో మాత్రం అంత లోతు నీటిలో కూడా ఓ బస్సు వేగంగా ఏదో సాధారణ రోడ్లపై దూసుకుపోతున్నట్లుగా వేగంగా దూసుకుపోతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూజిలాండ్ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో వరదలు రావటం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. భారీగా పోటెత్తిన వరదలకు ఇళ్లు నీటి మునిగాయి. రహదారులు సైతం వాహనాలు తిరగకుండా నీటితో నిండిపోయాయి. కానీ మెడలోతు నీళ్లల్లో మాత్రం ఓ బస్సు వేగంగా దూసుకుపోతున్న వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ బస్సు డ్రైవర్ కు ఎంత ధైర్యమో అనిపిస్తోంది. పైగా ఆ బస్సులో ప్రయాణీకులు కూడా ఉన్నారు. లోతైన నీటిలో వెళుతున్న బస్సులో ప్రయాణీకులు నిలబడి ఉన్నారు.
వరదలో స్థానిక పరిస్థితి ఎలా ఉందో లోతైన నీటిలో ప్రయాణిస్తున్న ఈ బస్సును చూస్తే అర్థమవుతోంది. వరద పరిస్థితిని తెలియజేయటానికి లోతైన నీటిలో ‘మెట్రో బస్సు’ వెళుతున్న దృశ్యాన్ని డిప్యూటీ చైర్మన్ డెబ్బీ బర్రోస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ లో వరద పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.