YCP MLA Perni Nani: మీ మామను తిట్టాలనుకుంటే డైరెక్టుగా తిట్టు.. మాతో ఎందుకు తిట్టిస్తావ్ హరీష్..

మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని, మామ అల్లుడితో చస్తున్నాం అని మా ఫ్రెండ్స్ చెబుతున్నారని కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి పేర్ని నాని విమర్శించారు.

YCP MLA Perni Nani: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు మేము ముందు నుండి వ్యతిరేకమేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. క్యాప్టివ్ మైన్ కేటాయించండి అని అడుగుతున్నామని, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లాభల్లోనే ఉందని చెప్పారు. తెలంగాణలో దిగిరాని కేంద్రం ఆంధ్రాలోనే దిగి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. సింగరేణి విషయంలో కేంద్రం ఎందుకు దిగి రాలేదో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. ఉట్టికి ఎగరలేని అమ్మ ఆకాశానికి ఎగిరింది అన్నట్టు ఉంది తెలంగాణ నేతల మాటలు అంటూ ఎద్దేవా చేశారు.

Harish Rao : ఏపీ మంత్రులకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ .. ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిదికాదంటూ చురకలు

హరీష్ రావుకు పైకే మామయ్య (కేసీఆర్) అంటే మర్యాద అని, లోపల కుత కుతలాడి పోతుంటారని అన్నారు. మీ మామను తిట్టాలని ఉంటే డైరెక్టు‌గా తిట్టు.. మాతో ఎందుకు తిట్టిస్తావ్ అంటూ పేర్ని నాని అన్నారు. ఇదంతా వాళ్ళ కుటుంబం‌లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నారు.

Harish Rao : దొంగే దొంగా అన్నట్లు మోదీ మాట్లాడారు, కేసీఆర్ ఓ అద్భుత దీపం-హరీశ్ రావు

మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని, మామ అల్లుడితో చస్తున్నాం అని మా ఫ్రెండ్స్ చెబుతున్నారని పేర్ని నాని విమర్శించారు. డ్రైనేజీ నీళ్ళు ఇళ్లలోకి వస్తుంటే ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆ సమస్యలను పరిష్కరించుకోకుండా ఏపీలో వైసీపీ పార్టీని విమర్శించడం వల్ల ఉపయోగం లేదని నాని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక లేదని ఎన్నికల కమిషన్ చెప్పిందని, ఇక మిగిలింది టీఆర్ఎస్ మాత్రమే అని నాని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు