Agros Renting Out Drones
AGRICULTURAL DRONES : రైతుల అవసరాలను గుర్తించి సేవలు విస్తరిస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ. వ్యవసాయ రంగంలో అనేక సేవలందిస్తున్న ఆగ్రోస్.. ఇప్పుడు మరో కొత్త తరహా సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు చేరువ చేస్తోంది. ఇందుకోసం అగ్రిస్టార్టప్స్ తో కలిసి ఖరీఫ్ పంటకాలని కల్లా డ్రోన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇవి వ్యవసాయంలో కూలీల సమస్య అధిగమించడానికి ఎంతగానో దోహదం పడనున్నాయి.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ రైతులకు అందుబాటులో ఉండేలా తెలంగాణ ఆగ్రోస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవాకేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు వెయ్యికి పైగా ఉన్న ఈ కేంద్రాల ద్వారా రైతులకు విశేష సేవలందిస్తోంది. వ్యవసాయ సామాగ్రిని ఈ కేంద్రాలలో కొంటే ఎలాంటి మోసాలు ఉండవని భరోసానిచ్చే స్థాయికి చేరుకుంది.
READ ALSO : Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!
ఒక వ్యవసాయ రంగమే కాకుండా ఇందన అమ్మకాల్లో కూడా అడుగు పెట్టి ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ. వ్యవసాయ రంగంలో అనేక సేవలందిస్తున్న తెలంగాణ ఆగ్రోస్ ఇప్పుడు మరో కొత్త తరహా సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తున్న రైతుసేవాకేంద్రాలు ఇకనుండి అగ్రిస్టార్టప్స్ తో కలిసి రైతులకు కావాల్సిన అన్ని సేవలను అందిస్తోంది.
ఇకనుండి పంటలకు ఎరువులు, విత్తనాలు చల్లేందుకు రైతులకు డ్రోన్లను ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు కిరాయికి ఇవ్వనున్నారు. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌తో ఆగ్రోస్ ఒప్పందం కూడా చేసుకున్నది.
READ ALSO : AGRICULTURAL DRONES : రైతులకు అద్దెకు డ్రోన్లు….తెలంగాణా ఆగ్రోస్ విన్నూత్న సేవలు
వ్యవసాయ రంగంలో రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. అందులో ప్రధానంగా వ్యవసాయ కూలీల కొరత రైతలను వేధిస్తోంది. దీనికి తోడు కూలీల రోజు వారి కూలీ విపరీతంగా పెరగడంతో.. రైతులు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ సమస్యకు ఏ చక్కటి పరిష్కారం లభించనుంది.