Bark Mite : పండ్లతోటల్లో బెరడు తొలిచే పురుగు నివారణ
ఈ పురుగు విసర్జించిన రంపపు పొట్టుతో కట్టుకున్న గూళ్ళు చెట్టు కాండంపైన స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు రైతులు ఈ లక్షణాలను గమనించి చెదపురుగుల ఆశించాయని అపోహపడతారు.
- Guntupalli Ramakrishna
- Published On : March 4, 2022 / 06:18 PM IST
Mango Trees On Farm. Mango Plantatio
Bark Mite : కొబ్బరి, పామాయిల్ కోకో సాగు రోజు రోజుకీ విస్తరిస్తుంది. ఉద్యానవపంటల సాగు పెరుగుతున్న నేపధ్యంలో పురుగుల బెడద అధికంగా ఉంది. ముఖ్యంగా మామిడి, కోకో, జామ,దానిమ్మ, చీని, మల్బరీ, మునగ తోటల్లో బెరడు తొలచిచే పురుగు బెడద అధికంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఈ పురుగు నివారణకు కోసం రైతులకు నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.
ఈ పురుగు లేత కొమ్మలపై ఎక్కువగా దాడి చేస్తుంది. లేత గోధుమ రంగులో ఉన్న తల్లి పురగులు మే , జులై లో కోశస్ధ దశ నుండి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంది. 10 రోజుల తరువాత గుడ్లు పొదిగి ముదురు గోధుమ రంగులో గొంగలి పురుగు బయటకు వచ్చిన తరువాత గూళ్ళలో ఉంటాయి. పిల్ల గొంగళి పురుగులు బెరడును తిని కాండంలోకి తొలుచుకుపోతాయి. పగటి పూట కాండంలో ఉంటూ రాత్రి సమయంలో అవి విసర్జించిన పదార్ధాల్లో తయారైన గొట్టం అకారంలో ఉన్న దారి ద్వారా బయటకు వచ్చి బెరడును తింటాయి.
ఈ పురుగు విసర్జించిన రంపపు పొట్టుతో కట్టుకున్న గూళ్ళు చెట్టు కాండంపైన స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు రైతులు ఈ లక్షణాలను గమనించి చెదపురుగుల ఆశించాయని అపోహపడతారు. దీని గొంగళి పురుగు దశ సుమారు 9 నుండి 10 నెలల వరకు ఉంటుంది. ఈ పురుగు ఆశించటం వల్ల చెట్టు కాండంపై బెరడు కోల్పోయి పుష్సాలు రాక పిందెలు ఏర్పడవు. పెద్ద చెట్టు చిన్న చెట్ల కన్నా ఎక్కువ దాడికి గురవుతాయి. ప్రత్యేకించి నిర్లక్ష్యం చేయబడిన తోటలు ఈ పురుగు ముట్టడికి ఎక్కవగా గురవుతుంది.
బెరడు తొలిచే పురుగు నివారణ;
దీని నివారణకు వదులుగా ఉన్న దెబ్బతిన్న బెరడును , కొమ్మలను పురుగు అశించిన కొవ్వలను తొలగించి కాల్చివేయాలి. లద్దె పురుగులు చేసిన రంధ్రాల్లో ఇనుప చువ్వలతో పొడిచి చంపాలి. రంధ్రాలను గమనించి దానిలో పెట్రోల్ లేదా కిరోసిన్లో ముంచిన దూదిని పెట్టాలి. పురుగు అశించిన రంధ్రంలోకి 0.5మి.లీ లీటరు నీటిలో కలిపి క్లోరాన్ట్రనిప్రోల్ లేదా డైక్లోరోవాస్ ని సిరంజ్ ఉపయోగించి పంపాలి. తరువాత బురదతో రంధ్రాన్ని పూడ్చాలి. తల్లి పురుగును ఆకర్షించటానికి దీపపు ఎరలను అమర్చాలి.
