Cucumber Cultivation : తక్కువ పెట్టుబడి.. దోస సాగుతో లాభాలు పొందుతున్న రైతు

Cucumber Cultivation : బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.

Cucumber Cultivation

Cucumber Cultivation : స్వల్పకాలంలో, తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటలలో కూరగాయలది మొదటిస్థానంగా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ఇదిగో ఇక్కడ చూడండీ…  మొత్తం పొలం కనిపించకుండా దోస తీగ అల్లుకుంది కదూ.. అవునండీ .. బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన రైతు గిరిప్రసాద్ 3 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నాడు. ఈయన గత 6 ఏళ్లుగా తనకున్న పొలంలోనే ప్రణాళిక బద్ధంగా  దోస పంటను సాగు చేస్తున్నాడు. డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులను అందిస్తున్నాడు.

ప్రస్తుతం పంట పూత, పిందె దశలో ఉంది. మరో 15 , 20 రోజుల్లో పంట దిగుబడులు ప్రారంభం కానున్నాయి. ఎకరాకు ఒక టన్ను వరకు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు