Cultivation Techniques Of Greengram
Greengram Cultivation : ఖరీఫ్‌లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతోపాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది . ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట మూడు ఆకుల దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. దీనిని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులను సాధించ వచ్చంటున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 3 ఆకుల దశలో దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పెసర సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది.
కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి డిగుబడులను పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి .
ముఖ్యంగా ఎర్రగొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలావరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టు కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లైతే ఆ పురుగులు జిల్లెడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడదనుండి పంటను కాపాడుకోవచ్చు.
Read Also : Mirchi Prices : తగ్గిన మిర్చి ధరలు.. ఆందోళనలో రైతులు