Red Gram Cultivation : కందిపంటలో శనగపచ్చ పురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Cultivation Techniques Of Red Gram : శనగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవరసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే ఏమందు ఏమోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం.

Cultivation Techniques Of Red Gram

Cultivation Techniques Of Red Gram : ఖరీఫ్ కంది ప్రస్తుతం కాత దశ ఉంది. ఈ దశలో పలు పురుగులు కంది పంటకు ఆశించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల  శనిగ పచ్చపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురుగుల వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.  దీని నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.

అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు రైతులు. ముఖ్యంగా కందిని ఏక పంటగానే కాక, అంతర పంటగాను సాగుచేశారు . వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. తొలిదశలో నివారించాలగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. శనిగపచ్చపురుగు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా వైరా కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి.

శనిగపచ్చ పురుగును రసాయన ఎరువులతోనే కాకుండా జీవరసాయనాలను ఉపయోగించి నివారించవచ్చు. అయితే ఏమందు ఏమోతాదులో వాడాలో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. మళ్లీ కంది పంటను సాగుచేయాలకునే రైతులు శనిగపచ్చపురుగు తట్టుకునే రకాను ఎంచుకోవాలి.

Read Also : Azolla Cultivation : అజొల్లా పెంపకంతో రైతులకు లాభాలు.. మరెన్నో ఉపయోగాలు

అంతే కాదు గత పంట అవశేషాలు లేకుండా లోతు దుక్కులను చేసుకుంటే శనిగ పచ్చ పురుగును నివారించేందుకు అస్కారముంటుంది. కందిలో ఎరపంటగా బంతి, రక్షక పంటగా మొక్కజొన్నను  సాగుచేసుకుంటే అధిక దిగుబడులను తీసేందుకు వీలుంటుంది.

శనగపచ్చ పురుగు నివారణ :

ఎల్.ఆర్.జి – 41, డబ్ల్యూ.ఆర్.జి – 65 వేసవి దుక్కులుచేసుకోవాలి. కందిలో ఎరపంటగా బంతి వేయాలి. రక్షక పంటగా మొక్కజొన్న వేయాలి

ఎకరాకు లింగాకర్షక బుట్టలు 4 అమర్చుకోవాలి

ఎకరాకు  పక్షి స్థావరాలు 8 – 10 ఏర్పాటుచేయాలి

వేపనూనె 1500 పి.పి.ఎం 5 మి. లీ లేదా

వేపగింజ కషాయం 5 శాతం

ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా

ఇండాక్సాకార్బ్  1 మి.లీ. లేదా

క్వినాల్ ఫాస్ 2 మి.లీ

ఉధృతి అధికంగా ఉంటే స్పైనోశాడ్ 0.3 మి. లీ.

ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా

క్లోరాంట్రినిలి ప్రోల్  0. 3 మి. లీ. లేదా

థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా

లామ్డాసైహోలోత్రిన్ 1 మి.లీ లేదా

క్లోరాంట్రినిలి ప్రోల్ +లామ్డాసైహోలోత్రిన్  0.4 మి. లీ పిచికారి చేయాలి

ఎకరాకు బ్యాసిల్లస్  తురింజెన్సిస్ 300 గ్రా. పిచికారి చేయాలి

ఎకరాకు హెలికోవెర్పా ఎన్.పి.వి ద్రావణం 200

Read Also : Mirchi Cultivation : పేనుబంకతో ఎదుగుదల లోపిస్తున్న మిరపతోటలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ట్రెండింగ్ వార్తలు