Mirchi Cultivation : పేనుబంకతో ఎదుగుదల లోపిస్తున్న మిరపతోటలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Mirchi Cultivation : ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పేనుబంక నివారణ పట్ల తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు

Mirchi Cultivation : పేనుబంకతో ఎదుగుదల లోపిస్తున్న మిరపతోటలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Mirchi Cultivation

Updated On : January 4, 2024 / 3:24 PM IST

Mirchi Cultivation : ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరపతోటల్లో రసంపీల్చు పురుగులు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. వీటివల్ల తోటలకు వైరస్ సోకి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో పేనుబంక పురుగు తాకిడితో కుకుంబర్ మొజాయిక్ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాయ పక్వ దశకు చేరుకుంటున్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జె. హేమంత్ కుమార్.

Read Also : Paddy Cultivation : వరినారుమళ్లపై శీతల గాలుల ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

మిరప తోటలో ప్రతి కొమ్మా రెమ్మకు, పూత, పిందెకు విపరీతంగా ఆశించిన ఈ పురుగు పేనుబంక. మొక్కలోని అన్ని భాగాలనుండి రసంపీల్చేయటం వల్ల తోట ఎదుగుదల క్షీణించి పోతుంది. మొక్కలు గిడసబారి క్రమేపి వైరస్ కు లొంగిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పేనుబంక నివారణ పట్ల తగిన శ్రద్ద కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జె.హేమంత్ కుమార్.

పేనుబంక పురుగు నివారణకు :

ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా

మిథైల్ డెమటాన్ 2మి.లీ లేదా

ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా.

లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారిచేయాలి

Read Also : Paddy Cultivation : వరినాట్లలో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకు పాటించాల్సిన మెళకువలు