Dates Cultivation : ఖర్జూరం.. ఒక్కసారి నాటితే.. 70 ఏళ్ళు దిగుబడి

Dates Cultivation : వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించడం రైతులకు సాధారమే అయినా.. ఆధునిక సాగు పద్ధతులను అవలంభిస్తూ.. వైవిధ్య పంటల సాగుతో విజయాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చర్చానీయాంశమే.

Dates Cultivation Process

Dates Cultivation : పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదగుతారు. ఈ సూత్రాన్నే కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈకోవలోనే కృష్ణా జిల్లాకు రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో ఖర్జూరం సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Read Also :Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించడం రైతులకు సాధారమే అయినా.. ఆధునిక సాగు పద్ధతులను అవలంభిస్తూ.. వైవిధ్య పంటల సాగుతో విజయాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చర్చానీయాంశమే. ఇలాంటి కోవకు చెందిన వారే రైతు శ్రీకాంత్. కృష్ణా జిల్లా, బాపుల పాడు మండలం, మడిచెర్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 4 ఎకరాల్లో టిష్యూకల్చర్ ఖర్జూరం సాగుచేస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు.

ఖర్జూరం అనగానే నల్లగా మెత్తగా ఉంటుంది. కానీ ఈ చెట్లకు చూడండీ.. పండు పండినా కూడా ఎల్లో కలర్ లోనే ఉన్నాయి.  ఈ రకం బర్హీ. ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండు యఅయ్యాకా పసుపు రంగులోకి మారుతుంది. సాధారణంగా ఖర్జూరాన్ని బెల్లంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తుంటారు. కానీ ఇది ఫ్రెష్ ఫ్రూట్. నేరుగా చెట్టునుండి కోసుకొని తినేయవచ్చు. కాయ పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది.

ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది.  ఈ రకాన్ని రైతు శ్రీకాంత్ 2019 జులైలో 4 ఎకరాల్లో నాటారు. మేట్జోల్, కన్జీ, ఎలైట్, యాకూబీ రకాలను కొన్ని మొక్కలు నాటారు.  ఇందులో మేట్జోల్ ఎండు ఖర్జూరం ఈ రకం . అయితే తెలుగు రాష్ట్రాల నేలలకు బర్హీ రకం అనువైనది. 3వ సంవత్సరం నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 5వ సంవత్సరం..  పంట కోత కోస్తున్నారు రైతు.

ఖర్జూరం మొక్కలు మూడేళ్లు దాటిన తర్వాత దిగుబడి అందించడం ప్రారంభిస్తాయి. మొక్క నాటిన డెబ్బై ఏళ్ల వరకూ ఫలసాయం ఉంటుంది. అయితే తొలి నాలుగైదేళ్లు జాగ్రత్తలు పాటిస్తే ఆ తర్వాత కొంత ఆదాయం మొదలవుతుంది. అంతేకాకుండా ఏటా దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మొక్కలకు వర్షాకాలంలో కొంత సమస్య ఎదురవుతుంది. అందుకే గెలలకు కవర్లు కట్టి నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు రైతు. వచ్చిన దిగుబడిని కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

పంట ఆరంభంలో పెట్టుబడి ఎక్కువే అయినా… పూర్తి పంట కాలంతో పోల్చుకుంటే ఆ పెట్టుబడి లెక్కలోకి కూడా రాదు. ఒక్కసారి నాటితే దాదాపు 70 సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు. ఇతర పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో… అధిక లాభాలు పొందవచ్చని రైతు అనుభవం నిరూపిస్తోంది. తోటి రైతులు కూడా మార్కెట్ లో డిమాండ్ ఉన్నఆధునిక పంటలను సాగుచేస్తే మంచి లాభాలు గడించవచ్చు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు