Orange Cultivation : ప్రస్తుతం బత్తాయి తోటల్లో వేయాల్సిన ఎరువులు

Fertlizers in Orange Cultivation : ముఖ్యంగా బత్తాయితోటలకు ఏడాదికి రెండు సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఈ తొలకరిలో, తోటల్లో ఆచరించాల్సినఎరువుల యాజమన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Fertlizers in Orange Cultivation : బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ తోటలు ఎక్కువగా  సాగులో వున్నాయి.  బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతుండటంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతుంటారు. ముఖ్యంగా బత్తాయితోటలకు ఏడాదికి రెండు సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఈ తొలకరిలో, తోటల్లో ఆచరించాల్సినఎరువుల యాజమన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా లో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. మొక్కల మధ్య ఎటుచూసినా 18 నుండి 21 అడుగుల దూరంతో ఎకరాకు 100 నుండి 135 మొక్కలు వచ్చే విధంగా ఈ తోటలను పెంచుతున్నారు. అయితే ఎకరాకు 100 మొక్కలు నాటిన తోటల్లో గాలి వెలుతురూ దారాళంగా వుండి చీడపీడల సమస్య తక్కువ వుంటుంది. సాధారణంగా రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు. దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్త అని, శీతాకాలపు పంటను ఆరుద్ర అని, వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు.

అయితే నూటికి 80 శాతం మంది రైతులు వేసవి పంట తీసేందుకు మొగ్గుచూపుతారు. ఎందుకంటే ఈ కాలంలో గత రెండేళ్లుగా టన్ను బత్తాయి 40 వేల నుండి 50 వేల ధర పలుకుతోంది. 6సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10టన్నుల దిగుబడిని సాధించే వీలుంది. ఈ ఏడాది అధిక ఎండలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల అన్ని ప్రాంతాల్లోను బత్తాయి దిగుబడి గణనీయంగా పడిపోయింది.  ప్రస్థుతం కొంతమంది రైతులు వర్షాకాలపు పంటను తీసుకుంటుండగా మరికొంత మంది రైతులు వేసవి పంటకోసం తిరిగి తోటలను సిద్ధం చేస్తున్నారు. బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావటానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది.  అయితే  ఆశించిన దిగుబడులను  పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి.   ప్రధాన పోషకాలైన నత్రజని,  భాస్వరం, పొటాష్ లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్నిస్తాయి.

బత్తాయి మొక్కలకు ఏడాదిలో రెండు దఫాలుగా ఎరువులను అందించాలి.  మొదటి దఫా ఎరువులు డిసెంబర్  , జనవరి నెలల్లో అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడే సమయం . ఈ సమయంలో రెండో దఫా ఎరువులను జూన్ , జులై మాసాల్లో వేసుకోవచ్చు. భాస్వరపు ఎరువును, సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలోను, పొటాష్ ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోను రెండు దఫాలుగా సమపాళ్లలో వేయాలి. అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.

మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్లు, బంక తెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి. చెట్టు మొదలు నుండి 4 అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి.  కేవలం 15 సెంటీమీటర్ల లోతు పాదులనే తీయాలి. లేదంటే పీచువేర్లపై ఎరువుపడి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా, ఆముదం పిండి లేదా, గానుగ పిండిని వేయాలి.  అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది.

అదే చిన్న మొక్కలకైతే  ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి. అలాగే బత్తాయి తోటల్లో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. చెట్లలో ఒకేసారి రెండు, మూడు సుక్ష్మపోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాధముంది. చెట్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇటువంటి సంధర్బాల్లో రైతులు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మాంగనీసు సల్ఫేట్ 2గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాక్స్ 1.5గ్రాములు, కొంచం జిగురు, లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారిచేయాలి. ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది చెట్లు త్వరగా కోలుకుంటాయి.

ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు , చెట్లను వాతావరణం బట్టి 15 -30 రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రీయపు ఎరువులను మరియు పచ్చిరొట్టను వాడటం వలన భూమిలో సత్తువ, తేమ నిల్వఉంచుకునే సామర్ధ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు