Gongura Cultivation : వేసవిలో అనుకూలంగా గోంగూర సాగు!
వీలైనంత వరకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు , మందులు వాడకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే పురుగుమందులు వాడాలి. గోంగూర పంటను ముఖ్యంగా దీపపు పురుగులు, పిండినల్లి, పచ్చ పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : May 8, 2022 / 03:15 PM IST
Gongura (1)
Gongura Cultivation : గోంగూర సాగుకు వేసవి కాలం అనువుగా ఉంటుంది. ఇతర ఆకు కూరలతో పోల్చితే గోంగూర సాగు రైతులకు మంచి అదాయం తెచ్చిపెడుతుంది. ఆకు కూరల్లో గోంగూరకు ప్రత్యేక స్ధానం ఉంది. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. నీటి వసతి కలిగిన భూముల్లో ఎకరానికి 4టన్నుల దిగుబడి వస్తుంది. గోంగూరను ఎర్రనేలలు, తేలిక రకపు నేలలతోపాటుగా, మురుగు నీరు పోయే సౌకర్య ఉన్న నేలల్లో సాగు చేయవచ్చు. ఎర్ర గోంగూర రకం వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కరానికి 5 నుండి 6టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరానికి 6 కిలోల విత్తనం సరిపోతుంది. ఆఖరి దుక్కిలో వేయాలి. విత్తనం వేసిన నాటి నుండి 4రోజులకు నీటి తడిని ఇవ్వాలి. గోంగూరను కోసిన ప్రతిసారి 10 కిలోల యూరియా వేసి నీరు పారించాలి.
వీలైనంత వరకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు , మందులు వాడకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే పురుగుమందులు వాడాలి. గోంగూర పంటను ముఖ్యంగా దీపపు పురుగులు, పిండినల్లి, పచ్చ పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది. వీటి నివారణకు వేపనూనెను ఒక లీటరు నీటిలో 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి. లేదంటే మలాధియాన్ మందును ఒక లీటరు నీటిలో 2మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
పంటకోత విషయానికి వస్తే నాటిన 25 రోజులకు గోంగూర తలలను తుంచాలి. 15 నుండి 20 రోజులకు ఒకసారి కొమ్మలను తుంచుతూ కోతలు కోయాలి. 5 కోతలు కోసిన తరువాత విత్తనం కోసం వదిలిపెట్టాలి. ఇలా చేస్తే గోంగూర సాగులో అధిక దిగుబడులు సాధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
