Silkworm Farming
Silkworm Farming : అతి వృష్టి, అనావృష్టి పరిస్తితుల కారణంగా సేద్యంలో రైతుకు ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడే కాకుండా, పంటకాలాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు చూస్తున్న రైతుకు మల్బరిసాగు ఓ వరంలా కనిపిస్తోంది. పట్టుపురుగుల పెంపకంలో తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా పంటలను తీసుకునే వెసులు బాటు ఉండటంతో రైతులు మల్బరీ సాగువైపు మొగ్గుచూపుతున్నారు.
READ ALSO : Farmers: చినుకు జాడ లేక బీటలు వారుతున్న చేలు.. ఆందోళనలో అన్నదాత.. వర్షాలు కురిస్తేనే..
5 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని, కేవలం ఒక్క ఎక్కరం మల్బరీ సాగుతో పొందే అవకాశం కల్పిస్తోంది పట్టు పరిశ్రమ. తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో చాలా మంది ఈ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు. ఈ కోవలోనే సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, ముండ్రాయి గ్రామానికి చెందిన రాజు దంపతులు గత ఏడాది నుండి పట్టుపురుగుల పెంపకం చేపట్టి సత్ఫలితాలను సాధిస్తున్నారు.
READ ALSO : Hindupur Lok Sabha Constituency: పరిటాల ఫ్యామిలీ ఫామ్‌లోకి వస్తుందా.. వైసీపీ పట్టు నిలుపుకోగలదా?
అంకితభావం, పట్టుదల, నిరంతర పర్యవేక్షణతో సాగు చేపడితే పట్టు పురుగుల పెంపకంతో, ఇతర పంటల కంటే, పదింతల అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని నిరూపిస్తున్నారు రైతు రాజు. సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసిన ఈయన గత ఏడాది నుండి తనకున్న 3 ఎకరాల్లో మల్బరిని పెంచుతున్నారు. పట్టు పురుగుల పెంపకానికి ఒక షెడ్ నిర్మించి ప్రతి పంటలో 100 నుండి 150 గుడ్లను పెంచుతూ.. నికర లాభాలను ఆర్జిస్తున్నారు.