Rice Varieties : అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక వరి రకాలు
తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : June 17, 2023 / 02:21 PM IST
Rice Varieties
Rice Varieties : వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకోస్తాయో తెలియని పరిస్థితులు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా పంట కాలాన్ని ముందుకు తీసుకరావాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఖరీఫ్ లో స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని సూచిస్తోంది. అయితే ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక రకాలేంటివి.. వాటి గుణగణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
READ ALSO : Kharif Rice Varieties : ఏపికి అనువైన ఖరీఫ్ వరి రకాలు
తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా రెండుమూడేళ్లుగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది.
READ ALSO : Pady Crop Cultivation : ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు
ఈ నేపధ్యంలో మధ్య, స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని ఇటు ప్రభుత్వం అటు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మధ్య కాలిక రకాలు జులై మొదటి వారం వరకు పోసుకునే అవకాశం ఉండగా, స్వల్ప కాలిక రకాలు జులై చివరి పోసుకోవచ్చు. అసలు ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక రకాలేంటీవి..? వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర రాజు.
