Jean Editing BPT : జీన్ ఎడిటింగ్ బి.పి.టి 5204.. ఎకరాకు 60 బస్తాల దిగుబడి

సాధారణంగా బిపిటి 5204 వరి వంగడం పంట కాలం 150 రోజుల దాకా ఉండటంతో ఖరీఫ్ లోనే రైతులు పండించాల్సి వస్తోంది. ఏకంగా 5 నెలల పాటు పైరు సాగులో ఉండటంవలన కరవు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సమస్యను అధిగమించడానికి జీన్‌ ఎడిటింగ్‌తో సాగుకాలాన్ని 20 రోజుల దాకా తగ్గించారు శాస్త్రవేత్తలు.

Jean Editing BPT 54204

Jean Editing BPT : రైతుసోదరులకు శుభవార్త. అతి తక్కువ కాలంలో.. అధిక దిగుబడినిచ్చే సన్నరకం జీనోమ్ ఎడిటెడ్ బిపిటి 5204 అందుబాటులోకి రానుంది. రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ జీన్‌ ఎడిటింగ్‌ పరిజ్ఞానంతో క్రిస్ పర్ క్యాస్ అనే పద్ధతి ద్వారా ఈ నూతన సన్నరకాన్ని రూపొందించింది .ఈ రకం బిపిటి కంటే 35 శాతం దిగుబడి పెరగడమే కాకుండా.. పంట కాలం 20 రోజులు తగ్గుతోంది. మరో రెండేళ్లలో  జెనోమి ఎడిటెడ్ బి.పి.టి – 5204 వరి రకం రైతులకు అందుబాటులోకి రానుంది.

READ ALSO : Pest Control In Paddy : ఎడగారు వరిలో పొట్టకుళ్లు పొడ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

బాపట్ల వరి పరిశోధనా స్థానం  విడుదలచేసిన  సాంబామసూరి పేరుతో విడుదల చేసిన   బిపిటి – ఏభై రెండు సున్నా నాలుగు ( 5204)  రకం ఇప్పటికీ వరిలో రారాజుగా వెలుగొందుతోంది. దేశవ్యాప్తంగా ప్రసిద్ది పొందిన ఈ వరి రకం ధాన్యం నుంచి వచ్చే సన్నరకం బియ్యాన్నే మార్కెట్లలో వ్యాపారులు ‘సోనా మసూరి’ అని వివిధ ప్రాంతాల పేర్లను ముందు తగిలించి విక్రయిస్తున్నారు.

READ ALSO : Weed Control : వరి సాగులో కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!

కర్నూలు సోనా ఈ రకానికి చెందిన బియ్యమే. దీనిలోని ఇతర మంచి లక్షణాలు మారకుండా అధిక దిగుబడి పొందేందుకు జీన్‌ ఎడిటింగ్‌ పరిజ్ఞానంతో కొత్త వంగడాన్ని సృష్టించారు రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ . సాధారణ వంగడంతో పండించిన పైరులో వరి మొక్కకు వచ్చే కంకిలో90 నుండి 150 వరకూ గింజలు ఉంటాయి. కానీ, జీన్‌ ఎడిటింగ్‌ వంగడంలో 350 నుంచి 400 వరకు గింజలు వచ్చాయి.

READ ALSO : Luffa Cultivation : బీరసాగుతో లాభల పంట

సాధారణంగా బిపిటి 5204 వరి వంగడం పంట కాలం 150 రోజుల దాకా ఉండటంతో ఖరీఫ్ లోనే రైతులు పండించాల్సి వస్తోంది. ఏకంగా 5 నెలల పాటు పైరు సాగులో ఉండటంవలన కరవు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సమస్యను అధిగమించడానికి జీన్‌ ఎడిటింగ్‌తో సాగుకాలాన్ని 20 రోజుల దాకా తగ్గించారు శాస్త్రవేత్తలు . ప్రస్తుతంబిపిటి 5204 వంగడంతో  ఎకరానికి 35-40 బస్తాల దాకా రైతులు దిగుబడి తీస్తున్నారు. ఈ కొత్త వంగడంతో ఎకరానికి 55-60 బస్తాల దిగుబడి వస్తుందని పరిశోధనల్లో తేలింది.

READ ALSO : Black Rice : నల్ల బియ్యానికి పెరుగుతున్న డిమాండ్, కిలో రూ.200… నల్ల వరిసాగు వైపు రైతుల మొగ్గు

జీన్‌ ఎడిటింగ్‌తో వరిమొక్కలో మరో కొత్త మార్పూ వచ్చింది.  వరిమొక్క కాండం సాధారణ వంగడాని కన్నా మరింత బలంగా పెరిగింది. ఇప్పటికే ప్రయోగశాలల్లో 3 సీజన్లలో పంట పండించి అధిక దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఐఐఆర్‌ఆర్‌ క్షేత్రాల్లో నాలుగో సీజన్‌లో సాగుచేస్తున్నారు. దీని పరిశోధన వివరాలన్నీ భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌)కు పంపారు. ఆ తరువాత రెండేళ్లపాటు రైతుల క్షేత్రాల్లో మినికిట్ దశలో సాగుచేసి అనంతరం రైతులకు అందుబాటులోకి తీసుకరానున్నారు.