Weed Control : వరి సాగులో కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!

పురుగు మందుల మాదిరిగా కలు పు నివారణ రసాయనాలను సూచించిన మో తాదుకు మించి వాడితే అసలు పంటలు కూడా ఎండిపోతాయి. నేలలు, వాతావరణం, సాగుచే సిన పంటలను బట్టి కలుపు మందులు వాడుకోవాలి.

Weed Control : వరి సాగులో కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!

Integrated Weed Management

Weed Control : వరి సాగు ఏపద్దతిలో చేపట్టినా అధిక దిగుబడి సాధన కోసం రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వరిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. దీని నివారణకు సరైన సమయంలో చర్యలు చేపట్టకపోతే అధిక దిగుబడులు సాధించటం కష్టసాధ్యమౌతుంది. వరి సాగులో వివిధ దశల్లో కలుపు యాజమాన్యానికి సంబంధించి రైతులు అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఎదపద్ధతిలో వరిసాగులో కలుపు నివారణ ; ఎదపద్ధతిలో చేపట్టిన వరి సాగులో విత్తనాన్ని 48 గంటల నానబెట్టి మొలక కట్టిన వరి విత్తనాన్ని రైతులు నాటటానికి వినియోగిస్తారు. విత్తనం విత్తిన తరువాత ప్రిటిలాక్లోర్ సెఫనర్ మందును ఎకరాకు 600 మి.లీ నుండి 800 మి.లీ వరకు విత్తిన 5 రోజుల లోపు వాడుకోవాలి. పైరజో సల్య్ఫురాన్ ఈథైల్ అను కలుపు మందును ఎకరాకు 80 నుండి 100 గ్రాములు విత్తిన 8 నుండి 10 రోజుల లోపు వాడాలి. ఇది గడ్డి జాతి కలుపును నివారిస్తుంది. బ్యూటీక్లోర్ లీటరు మందును ఎకరాకు వాడుకోవాలి. విత్తిన 10 రోజుల లోపు వాడాలి.

వరి నారు మడిలో కలుపు నివారణ ; వరి నారు మడిలో కలుపు నివారించేందుకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మందును ఎకరాకు 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిన్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 ఎం.ఎల్ మందును ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు వేసుకోవాలి. నాటిన వరి పొలంలో కలుపు యాజమాన్యం కోసం బ్యూటిక్లోర్ లీటరు మందును 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. సైహలోవాప్ పిబ్యూటైల్ 300 ఎం.ఎల్ మందు ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

వరిలో నాటిన వా రంరోజుల్లోపు ఎకరానికి లీటరు బుటాక్లోర్‌, అనిలోఫాస్‌, ప్రటిలాక్టేర్‌లలో ఏదో ఒక రసాయానాన్ని పొడి ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి నాటిన 30రోజుల్లో కలుపు నివారణకు ఎకరానికి 400 గ్రాముల 2, 4డి సోడియం సాల్డ్‌ లేదా 50 గ్రా ముల ఇథాక్సిసల్ఫ్యురాన్‌ పొడిని పిలిచికారి చేయాలి. అయితే సాగు చేసిన పంటలో మొలకెత్తిన కలుపును బట్టి రైతులు వ్యవసాయ నిపుణు ల సూచనల మేరకు రసాయనాలను వాడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

పురుగు మందుల మాదిరిగా కలు పు నివారణ రసాయనాలను సూచించిన మో తాదుకు మించి వాడితే అసలు పంటలు కూడా ఎండిపోతాయి. నేలలు, వాతావరణం, సాగుచే సిన పంటలను బట్టి కలుపు మందులు వాడుకోవాలి. కలుపు మొక్కల్లో ఏక వార్షిక, బహు వార్షిక రకాలుంటాయి. గనుగు, ఉత్తరేణి, అడవి తుల సి, తోటకూర వంటివి ఏకవార్షిక కలుపు మొక్క లు. అంటే ఏడాదిలో ఓకే సారి మొలుస్తాయి. వీ టి నివారణకు అనేక మందులు ఉన్నాయి. బ హువార్షిక కలుపు మొక్కల్లో దారుగ, గర్క, తుంగ వంటివి ఉన్నాయి. పంట వేసిన ప్రతీ సారి ఇవి మొలుస్తాయి. వీటి నివారణకు గ్లెఫోసేట్‌ రసాయనం సమర్థంగా కలుపును నిర్మూలిస్తుంది.