Kanda Yam Cultivation : కంద పంటలో సూక్ష్మధాతు లోపాలు – నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం  

Kanda Yam Cultivation : రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో  కంద ఒకటి. కంద నాటడానికి మే, జూన్ నెలలు అనుకూలం. కందను ముఖ్యంగా  కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు.

Kanda Yam Cultivation

Kanda Yam Cultivation : దుంపజాతి కూరగాయ పంటల్లో కారట్, బీట్ రూట్, పెండలం, కంద వంటి పంటలు ప్రధానమైనవి. కందను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లోను, తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో సాగుచేస్తుంటారు రైతులు . మే నెల రెండవ పక్షంలో కందను విత్తారు. ప్రస్థుతం మొలక దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మదాతులోపాలు ఏర్పాడ్డాయిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సూక్ష్మధాతు లోపాలను ఏవిధంగా సవరించవచ్చో ఇప్పుడు చూద్దాం..

Read Also : Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో

రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో  కంద ఒకటి. కంద నాటడానికి మే, జూన్ నెలలు అనుకూలం. కందను ముఖ్యంగా  కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండిపదార్ధాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఎ, విటమిన్ బి ఎక్కువగా వుంటాయి. అందువల్ల అందరికీ మంచి ఆహారం. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో దీని వాడకం ఎక్కువగా వుంటుంది. కందను  మే- జూన్ నెలల్లో నాటితే జనవరి, ఫిబ్రవరినెలల్లో పంట పక్వానికొస్తుంది. మన రైతాంగం సారవంతమైన నేలల్లో కందను నాటి ఎకరానికి 26- 30టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు.

కందలో ముఖ్యంగా విత్తనపు ఖర్చు ఎక్కువగా వుంటుంది. ఎకరానికి 6-7టన్నుల విత్తనం అవసరం ఉంటుంది. విత్తనం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అది వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అందువల్ల మార్కెటింగ్ ను బట్టి  ప్రతీసంవత్సరం కంద సాగుచేసే రైతులు, సొంత విత్తనం కోసం కొద్ది విస్తీర్ణంలో అయినా సాగును చేపడతారు. ప్రధానంగా గజేంద్ర రకం సాగులో వుంది. ప్రస్థుతం మే నెలలో విత్తిన కంద శాకీయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతులోపాలు ఏర్పడ్డాయి. దీని వల్ల సరైన పెరుగుదలలేక, మొక్కల ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు. ఈ నేపధ్యంలో వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. చైతన్యం.

ముఖ్యంగా కంద పంటలో ఇనుపధాతులలోపం తోపాటు జింకు, మెగ్నిషియం ధాతు లోపాలు కూడా ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు. జింకుధాతు లోపం ఏర్పడితే, ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణంగా మారి క్రమేపి ఆకు మొత్తం పండి, ఎండిపోతుంది, ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. అలాగే మెగ్నిషియం ధాతు లోపం ఏర్పడితే ఆకులపై లేత పసుపు, ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి వైరస్ తెగులు లక్షణాలను పోలి ఉంటాయి. ఈ లక్షణాలను గమనించిన వెంటనే మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు, లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Read Also : Paddy Crop : వెద పద్ధతి వరిలో కలుపు యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు