Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో

Kisan Agri Show 2024 : దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి దాదాపు 140 కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ , అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శించాయి. నూతన ఆవిష్కర్తలు వ్యవసాయరంగంలో సాంకేతికతలను నిర్మించేందుకు ఈ ప్రదర్శన బాట వేయగలదు.

Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో

Kisan Agri Show At Hyderabad

Kisan Agri Show 2024 : హైదరాబాద్, హెటెక్స్ లో 2వ కిసాన్ అగ్రి షో ప్రారంభమైంది. కిసాన్ ఫోరమ్ అధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి దాదాపు 140 కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ , అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శించాయి. నూతన ఆవిష్కర్తలు వ్యవసాయరంగంలో సాంకేతికతలను నిర్మించేందుకు ఈ ప్రదర్శన బాట వేయగలదని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Sesame Cultivation : వేసవి నువ్వుకు చీడపీడలు ఆశించే అవకాశం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

వ్యవసాయం, అనుబంధరంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే చోట ఏర్పాటుచేసి , రైతులకు అవగాహన కల్పిస్తోంది కిసాన్ ఫోరమ్ సంస్థ. 2024 కిసాన్ అగ్రి షో పేరుతో హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. ఇప్పటికే ఈ అగ్రి షో విజయవంతం కాగా ఈ సారి నిర్వహించడం రెండవసారి.

నేటితో ముగియనున్న ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 144 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు,  ఇంప్లిమెంట్స్, ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.

Read Also : Mango Cultivation : మామిడిలో పూత, కాయ నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు