Mango Cultivation : మామిడిలో పూత, కాయ నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు

Mango Cultivation : మామిడి పంటలో పూత, కాత దశే కీలకం. వచ్చిన పూత, పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేతలంటున్నారు.

Mango Cultivation : మామిడిలో పూత, కాయ నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు

Measures to prevent fruit retention in mango Cultivation

Mango Cultivation : తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత, కాత దశలో ఉన్నాయి. చాలా చోట్ల తామరపురుగులు, తేనెమంచు పురుగులు, రసంపీల్చే పురుగులు, ఆకుజల్లెడ గూడుపురుగుల  బెడద అధికమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని వెంటనే అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మామిడి తోటల్లో పూత , పిందె వచ్చాక ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలిజేస్తున్నారు బెల్లంపల్లి కో ఆర్డినేటర్ కోటా శివకృష్ణ .

మామిడిలో పూత, కాత దశే కీలకం :
గత రెండేళ్లుగా మామిడి తోటలనుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ సారైనా మంచి ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు రైతులు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో మామిడి మొక్కలకు కాయలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో  పూత, పిందె దశలో ఉన్నాయి. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే పూత ప్రారంభమవుతుంది. అయితే మామిడి పంటలో పూత, కాత దశే కీలకం. వచ్చిన పూత, పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేతలంటున్నారు.

అంతే కాదు పూత నుండి కాయ దశలో మారాకా కూడా పురుగులు అధికంగానే ఆశిస్తుంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే చీడపీడలు.. వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కో ఆర్డినేటర్ కోటా శివకృష్ణ.

Read Also : Sesame Cultivation : వేసవి నువ్వుకు చీడపీడలు ఆశించే అవకాశం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు