Lemon Crop : నిమ్మ పంటలో పూత నియంత్రణ, పిందె రాలటాన్ని అరికట్టే యాజమాన్యపద్ధతులు!

పిందె, కాయ రాలుట రెండు దశలుగా గమనించవచ్చు. నీటి ఒడుదుడుకులు, హఠాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, కొన్ని చెట్లలో జరిగే రసాయనిక మార్పుల వలన పిందె కాయ రాలటం జరుగుతుంది. చెట్లు పూత, పిందెలతో ఉన్నప్పుడు త్రవ్వడం, దున్నడం చేయరాదు.

Lemon Crop : సహజంగా నిమ్మ మొక్కలు సంవత్సరం పాడువున పూతను పూస్తాయి. పూతని నిలపటం వల్ల రైతులకు సరైన దిగుబడులు అందవు. కాబట్టి ఒక సీజన్‌లో మాత్రమే అధిక దిగుబడులను పొందాలంటే మొక్కలో ఒత్తిడి పెంచి పూతను తీసుకురావలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో నిమ్మ జాతి మొక్కలు మూడు కాలాల్లో పూతకు వస్తాయి. జనవరి-ఫిబ్రవరి మరియు అక్టోబర్‌ లో పూతకు వస్తాయి.

జనవరి-ఫిబ్రవరిలో ఎక్కువ పూత కోసం నవంబర్‌-డిసెంబర్‌ మాసంలో నీటి ఎద్దడికి గురిచేయాలి. ఇందుకుగాను నీటి తడులను తగ్గించి డిసెంబర్‌ మాసంలో పూర్తిగా నీటిని ఆపివేయటం వలన ఆకులు వాడుకట్టి రాలిపోతాయి. దీనిని ‘బహార్‌’ అంటారు. ఇలా డిసెంబర్‌ చివరిలో పాదులు చేస్తి మట్టి 10 సెం.మీ. లోతులో గుల్లచేసి, సూచించిన మోతాదులో ఎరువులను అందించి నీరు కట్టిన యెడల పూత బాగా వస్తుంది. ఇట్టి సమయంలో మొదటి తడి తక్కువగా ఇచ్చి అటు తరువాత నుండి ఎక్కువ నీరు అందిస్తే మొదటి తడి తరువాత నెల
రోజులకు పూత ప్రారంభమవుతుంది.

నిమ్మలో పూత నియంత్రణ ;

నిమ్మలో వేసవిలో అధిక దిగుబడులు సాధించడానికి ముందుగానే పూతను నియంత్రించడానికి, జూన్‌ మాసంలో 50 పి.పి.యం. (50 మి. గ్రా./లీటరు నీటికి) జిబ్బరిల్లిక్‌ ఆమ్లాన్ని సెప్టెంబరు మాసంలో 1000 పి.పి.యం. సైకోసెల్‌ ద్రావణాన్ని ఆ తర్వాత అక్టోబరు మాసంలో చివరిగా 1 శాతం పొటాషియం నైట్రేటు ద్రావణాన్ని (10 గ్రా..లీ.) పిచికారి చేయాలి.

పూత, పిందె రాలుడును అరికట్టడం:

పిందె, కాయ రాలుట రెండు దశలుగా గమనించవచ్చు. నీటి ఒడుదుడుకులు, హఠాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులు, కొన్ని చెట్లలో జరిగే రసాయనిక మార్పుల వలన పిందె కాయ రాలటం జరుగుతుంది. చెట్లు పూత, పిందెలతో ఉన్నప్పుడు త్రవ్వడం, దున్నడం చేయరాదు. ఎండలు పెరిగే కొద్దీ చెట్లకు క్రమం తప్పక నీరు కట్టాలి. 1 మి.లీ. ష్లానోఫిక్స్‌ 4.5 లీటర్ల నీటిలో లేదా 10 పి.పి.యం. 2,4 -డి మందు అంటే 1 గ్రా. 100 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒక మారు పిందె గోలి సైజులో ఉన్నప్పుడు మరోసారి, కోతకు రెండు నెలల ముందు పిచికారి చేయాలి.

ట్రెండింగ్ వార్తలు