Mango Farming : 40 ఎకరాల్లో మామిడి సాగు.. ఏడాదికి రూ. 50 లక్షల నికర ఆదాయం

7 ఏళ్ళపాటు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేసిన రైతు.. శ్రమ అధికంగా ఉండటం.. కూలీలు అధికంగా అవుతుండటంతో  మూడేళ్లుగా సెమీఆర్గానిక్ విధానంలో మామిడి సాగుచేస్తున్నా. ఇందుకోసం తోటలోనే పశువులను పెంచుతూ... వాటి నుండి వచ్చే వ్యర్థాలను మొక్కలకు అందిస్తున్నారు.

Mango Farming : నేల ఆరోగ్యమే పంటకు రక్షణ కవచం. పదికాలాలపాటు ఫలసాయాన్ని అందించే మామిడి తోటల్లో పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడటం శ్రేయస్కరం కాదు. దీనివల్ల  ఖర్చు పెరగడంతో పాటు, నాణ్యత తగ్గటం, దిగుబడి క్షీణించటం జరుగుతోంది. అంతే కాదు భూసారం  దెబ్బతింటోంది. వీటన్నింటికీ దూరంగా నాణ్యమైన ఉత్పత్తులను పొందాలంటే  ప్రకృతి సాగే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న తరుణంలో రైతులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే తిరుపతిజిల్లాకు చెందిన ఓ రైతు తనకున్న 40 ఎకరాల్లో సెమీ ఆర్గానిక్ పద్ధతిలో మామిడి సాగుచేస్తూ… మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

READ ALSO : kharif Cultivation : ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు.. విత్తన సేకరణలో పాటించాల్సిన మెళకువలు

పంట ఆరోగ్యంగా పెరిగితే రైతుకు ఖర్చు తగ్గి, ఆర్ధిక ప్రయోజనాలు ఆశాజనకంగా వుంటాయి. ఈ నియమాన్ని ఊతంగా చేసుకుని మెట్ట, మాగాణీ పంటల్లో తన ఆర్ధిక ప్రగతికి చక్కటి బాట వేసుకుని సేద్యంలో రాణిస్తున్నారు తిరుపతి జిల్లా, గూడూరు మండలం, కొమ్మనేటూరు గ్రామానికి చెందిన రైతు ప్రసాదరావు. అరోగ్యవంతమైన పెరుగుదలతో, ప్రతీమొక్కనిండా కాయలతో కళకళలాడుతూ సెమీ ఆర్గానిక్ విధానంలో మామిడి తోటను ఇంత ఆశాజనకంగా తీర్చిదిద్దారు రైతు ప్రసాదరావు.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

రైతు ప్రసాదరావుది నెల్లూరు జిల్లా. ఎంటెక్ చదువుకున్నఈయన బెంగళూరులో డిజైన్ ఇంజనీర్ 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే వ్యవసాయం పై ఉన్న మక్కువతో కొమ్మనేటూరు గ్రామంలో 14 ఏళ్లక్రితం 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే అప్పటికే 10 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మరో 30 ఎకరాల్లో 10 ఏళ్ల క్రితం బంగిన పల్లి రకం మామిడి మొక్కలను నాటారు. అందులో 98 శాతం బంగినపల్లి, మిగితా రెండు శాతం అంటుమామిడి, నీలం, కొబ్బరి మామిడి, హిమామిపసంద్, సువర్ణరేఖ రకాలు ఉన్నాయి.

READ ALSO : Pink Bollworm Control : పత్తిలో గులాబిపురుగుల నివారణకు ముంస్తు జాగ్రత్తలు

7 ఏళ్ళపాటు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేసిన రైతు.. శ్రమ అధికంగా ఉండటం.. కూలీలు అధికంగా అవుతుండటంతో  మూడేళ్లుగా సెమీఆర్గానిక్ విధానంలో మామిడి సాగుచేస్తున్నా. ఇందుకోసం తోటలోనే పశువులను పెంచుతూ… వాటి నుండి వచ్చే వ్యర్థాలను మొక్కలకు అందిస్తున్నారు. అలాగే సూక్ష్మపోషకాలను డ్రిప్ ద్వారా అందిస్తూ.. నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు.

READ ALSO : Hybrid Chili Varieties : మిరపలో హైబ్రిడ్ లకు దీటుగా సూటిరకాలు.. అధిక దిగుబడులిస్తున్నలాంఫాం రకాలు

ఏడాదికి 140 నుండి 150 టన్నుల దిగుబడి తీస్తున్నారు రైతు ప్రసాదరావు. వచ్చిన దిగుబడిని ప్రతి ఏటా 30 టన్నుల వరకు కొట్ర ఫామ్స్ పేరుతో ఆన్లైన్ ద్వారా మార్కెట్ కు అనుగుణంగా కిలో ధర రూ. 100 నుండి  120 రూపాయల చొప్పున బెంగళూరులో నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. మిగితా దిగుబడిని తోటవద్దే వ్యాపారులకు అమ్మకం చేపడుతున్నారు. 40 ఎకరాలపై అన్ని ఖర్చులు పోను ఏడాదికి 40 నుండి 50 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు