Disease to Cattle : పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి, నివారణ
డెయిరీ ఫామ్ లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా వుంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకామందులు వేయిస్తే, పశువులు అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి, పొదుగు వాపు వ్యాధికి లొంగిపోకుండా వుంటాయి.
- Guntupalli Ramakrishna
- Updated on- March 8, 2023 / 04:54 PM IST
Mastitis in dairy cattle, prevention
Disease to Cattle : పశువుల్లో సోకే వ్యాధులు అతి ప్రమాధకరమైంది పొదుగువాపు వ్యాధి. పాడిపశువుల పోషణలో రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య ఇదే. దీన్ని మాస్టైటిస్ డిసీస్ అంటారు. ఒకసారి ఈ వ్యాధి సోకిందంటే పశువుపై ఆశలు వదులుకోవాల్సిందే. వ్యాధి నుండి పశువు కోలుకున్నా… పూర్వస్థాయిలో పాల దిగుబడి సాధించటం కష్టం. ఇటీవలికాలంలో పశువైద్యుల వద్దకు పొదుగువాపు సోకిన పశువులు అధికంగా వస్తున్నాయి.
READ ALSO : Brecullosis : పశువులలో ప్రమాదకరంగా మారుతున్న బ్రూసెల్లోసిస్ వ్యాధి
ఈ వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి నివారించకపోతే, రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి పశువు కోలుకోవటం కూడా చాలా కష్టమవుతుంది. ప్రస్థుతం పాడి గేదెల ధర భారీగా వున్నందున, రైతుకు ఆర్థికంగా కోలుకోలేని కష్టం ఏర్పడుతుంది. డెయిరీ ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల ఈ తెగులు సోకే అవకాశం వుంటుంది.
డెయిరీ ఫామ్ లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా వుంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకామందులు వేయిస్తే, పశువులు అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి, పొదుగు వాపు వ్యాధికి లొంగిపోకుండా వుంటాయి.
READ ALSO : Cattle : పాడి పశువుల్లో గర్భాశయ సమస్యలు, నివారణ చర్యలు
ఈ వ్యాధి లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ఖమ్మం రూరల్ మండలం పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ సర్జన్ డా. కొర్లకుంట కిషోర్ అందిస్తున్నారు. పూర్తి స్ధాయి సమాచారం కోసం క్రింద ఉన్న వీడియో లింక్ పై క్లిక్ చేయండి.