Rice Varieties : మేలైన మధ్యకాలిక.. దొడ్డు, సన్నగింజ వరి రకాలు

Rice Varieties : కొన్ని చోట్ల రైతులు దొడ్డు గింజ రకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఏరకం ఎంత దిగుబడి వస్తుంది... చీడపీడలు తట్టుకుంటాయో.. లేదో తెలియక సతమతమవుతుంటారు.

Rice Varieties : ఖరీఫ్ ప్రారంభమైంది.. చాలా మంది రైతులు దీర్ఘకాలిక వరి రకాలను పోసుకున్నారు. ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్య కాలిక రకాలను ఎంచుకొని సాగు చేయడం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు ఉన్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా  వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

వరిసాగులో రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి   కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువకాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు  రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యంగా అంటే జూన్ 15 తరువాత మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు నార్లు పోసుకునే వీలుంది. మధ్యకాలిక సన్నగింజ వరి రకాలు.. వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర .

కొన్ని చోట్ల రైతులు దొడ్డు గింజ రకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఏరకం ఎంత దిగుబడి వస్తుంది… చీడపీడలు తట్టుకుంటాయో.. లేదో తెలియక సతమతమవుతుంటారు. అంలాంటి వారికోసం ఖరీఫ్ కు అనువైన దొడ్డుగింజ రకాలు వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు