Pest Control
Pest Control : తక్కువ పెట్టుబడితో, స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు.. ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్ పంటలు పూర్తయిన పొలాలు, వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను రైతులు సాగు చేశారు. ఇప్పటికే విత్తిన ప్రాంతాల్లో పైరు 20 రోజుల నుండి నెల రోజుల దశ వరకు వుంది. అయితే పెసర, మినుము పంటల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్.
Read Also : Paddy Cultivation : రబీ వరిలో చీడపీడల నివారణ పద్ధతులు
పెసర, మినుము పంటలను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తుంటారు. అంతే కాదు ఏకపంటగాను, అంతర పంటగాను సాగుచేసుకునే వెసులు బాటు ఉంది. అందుకే చాలా మంది రైతులు రబీలో పెసర, మినుము పంటలను సాగుచేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 30 రోజుల దశ వరకు పైర్లు ఉన్నాయి.
అయిలే అపరాలలో మొక్కదశ నుండి పూత, కాయదశలో అధికంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులను తీయవచ్చని సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్.
ఎరువుల యాజమాన్యం :
ఎకరాకు నత్రజని 8 కి. భాస్వరం 20 కి.
డిఏపి – బస్తా యూరియా 5-10 కి.
అపరాలను ఆశించే చీడపీడలు
చిత్తపురుగులు, తామరపురుగులు
తెల్లదోమ , పచ్చదోమ పేనుబంక
మారుకా మచ్చల పురుగులు
రసం పీల్చే పురుగుల నివారణ
డైమిథోయేట్ 2 మి. లీ. లేదా
ఇమిడాక్లోఫ్రిడ్ 0.4 మి. లీ. లేదా
థయామిథాక్సామ్ 0.2 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి
మారుకామచ్చల పురుగు నివారణ
ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.4 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ఎకరాకు స్పైనోశాడ్ 60 గ్రా.
200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి
బూడిద తెగులు నివారణ
నీటిలో కరిగే గంధకం 3 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ప్రొపికొనజోల్ 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
హెక్సాకొనజోల్ 2 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
మైకోబొటనిల్ 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ