Preventing Bacterial Spot : టమాటలో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

పాలీమల్చింగ్ విధానంలో, స్టేకింగ్ చేసి, డ్రిప్ సాగు విధానంలో ఆధునిక పద్ధతుల్లో టమాటా సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల కలుపు విపరీతంగా పెరిగినప్పటికీ పాలీమల్చింగ్ కలుపును అడ్డుకుంది. అయితే తోటకు బాక్టీరియా ఆకుమచ్చ తెగులు వల్ల దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

preventing Bacterial Spot

Preventing Bacterial Spot : అధిక వర్షాల వల్ల కూరగాయలు సాగుచేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పొలంలో కలుపు విపరీతంగా పెరగటం, తోటల్లో చీడపీడల ఉధృతమవటంతో పంట పెరుగుదల క్షీణించి, దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా టమాట తోటల్లో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

పాలీమల్చింగ్ విధానంలో, స్టేకింగ్ చేసి, డ్రిప్ సాగు విధానంలో ఆధునిక పద్ధతుల్లో టమాటా సాగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల కలుపు విపరీతంగా పెరిగినప్పటికీ పాలీమల్చింగ్ కలుపును అడ్డుకుంది. అయితే తోటకు బాక్టీరియా ఆకుమచ్చ తెగులు వల్ల దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాయలు పిందె దశలోనే కుళ్లిపోవటం, తెగులు వుధృతి వల్ల ఆకులు రాలిపోవటం వల్ల పంట పెరుగుదల క్షీణించింది.

READ ALSO : Watermelon Cultivation : ఎల్లో రకం పుచ్చసాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం

ఖమ్మం జిల్లాలోని చాలాప్రాంతాల్లో టమాట తోటల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాళ్ల మధ్య కలుపును సకాలంలో అరికట్టినప్పటికీ తెగులును సకాలంలో గుర్తించకపోవటం వల్ల, తోటలో దీని ఉధృతి పెరిగిపోయింది. సాధారణ ఫంగిసైడ్ మందులు వాడినప్పటికీ నివారణ కాలేదు. రైతులు దీన్ని బాక్టీరియా ఆకుమచ్చ తెగులుగా గుర్చించి నివారణ చేపట్టాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్.