Watermelon Cultivation : ఎల్లో రకం పుచ్చసాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం
తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేసే తీగజాతి పంట వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ . వీటి వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో తేలికపాటి భూములు, గరపనేలలు వున్న అన్ని ప్రాంతాల్లోను అధిక విస్తీర్ణంలో ఈ పంటలు సాగవుతున్నాయి.

Watermelon Cultivation
Watermelon Cultivation : ప్రతి ఏటా సంప్రదాయ పంటలను సాగుచేసి నష్టాలను చవిచూస్తున్న రైతులు.. ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ సమయంలో చేతికొచ్చే ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే తిరుపతి జిల్లాకు చెందిన ఓ రైతు ఎల్లో రకం పుచ్చ సాగుచేపట్టి మంచి లాభాలను ఆర్జించేందుకు సిద్ధమవుతున్నారు.
READ ALSO : Goru Chikkudu : గోరు చిక్కుడు సాగులో యాజమాన్యపద్ధతులు !
తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగు చేసే తీగజాతి పంట వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ . వీటి వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో తేలికపాటి భూములు, గరపనేలలు వున్న అన్ని ప్రాంతాల్లోను అధిక విస్తీర్ణంలో ఈ పంటలు సాగవుతున్నాయి. ఈ కాయల్లో 90 శాతం నీటితో పాటుగా ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కాలరీలు ఉంటాయి. అంతే కాకుండా దాహాన్ని తీర్చే గుణం కలిగి ఉండటం వల్ల వీటి వినియోగం వేసవిలో అధికంగా ఉంటుంది.
గతంలో 10 నుండి 15 కిలోలు బరువు తూగే పుచ్చ రకాలు వుండేవి. అయితే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయల వచ్చే హైబ్రిడ్ ల అభివృద్ధి జరగటం.. ఇటు పలు రంగుల్లో అందుబాటులోకి రావటంతో పాటు అన్నికాలాల్లోను సాగుచేయదగ్గ రకాలు లభిస్తుండటంతో కొంతమంది రైతులు ఏడాది పొడవునా పుచ్చసాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
READ ALSO : Betel Cultivation : తమలపాకు సాగులో చీడపీడలు, తెగుళ్ళు నివారణ
ఈ కోవలోనే తిరుపతి జిల్లా, కోట మండలం, గూడలి గ్రామానికి చెందిన రైతు జనార్థన్ రెడ్డి ఒక ఎకరంలో ఎల్లోరకం పుచ్చసాగుచేపట్టారు. మరికొద్ది రోజుల్లో పంటను కోయనున్నారు. మార్కెట్లో ప్రస్తుతం పలుకుతున్న ధరను చూస్తే ఎకరాకు 2 నుండి 3 లక్షల నికర ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.