Mastitis in Cattle : పశువుల్లో పొదుగువాపు వ్యాధి నివారణ పద్ధతులు

Mastitis in Cattle : పశువైద్యుల వద్దకు పొదుగువాపు సోకిన పశువులు అధికంగా వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prevention of mastitis in cattle

Mastitis in Cattle : పాడిపశువుల పోషణలో రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య పొదుగువాపు వ్యాధి. దీన్ని మాస్టైటిస్ డిసీస్ అంటారు. ఒకసారి ఈ వ్యాధి సోకిందంటే పశువుపై ఆశలు వదులుకోవాల్సిందే. వ్యాధి నుండి పశువు కోలుకున్నా… పూర్వస్థాయిలో పాల దిగుబడి సాధించటం కష్టం. ఇటీవలికాలంలో పశువైద్యుల వద్దకు పొదుగువాపు సోకిన పశువులు అధికంగా వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందస్తు జాగ్రత్తలతో నివారణ చర్యలు :
పశువుల్లో సోకే వ్యాధులు అతి ప్రమాధకరమైంది పొదుగువాపు వ్యాధి.  ఈ వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించి నివారించకపోతే, రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి పశువు కోలుకోవటం కూడా చాలా కష్టమవుతుంది. ప్రస్థుతం పాడి గేదెల ధర భారీగా వున్నందున, రైతుకు ఆర్థికంగా కోలుకోలేని కష్టం ఏర్పడుతుంది.

డెయిరీ ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల ఈ తెగులు సోకే అవకాశం వుంటుందంటూ…. పొదుగు వాపు వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారుఖమ్మం రూరల్ మండలం పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ సర్జన్ డా. కొర్లకుంట కిషోర్…

డెయిరీ ఫామ్ లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా  అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా వుంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకామందులు వేయిస్తే, పశువులు అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి, పొదుగు వాపు వ్యాధికి లొంగిపోకుండా వుంటాయి.