Sesame Crop Cultivation : నువ్వులో పెరిగిన తెగుళ్ల ఉధృతి – నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం

Sesame Crop Cultivation : పూత సమయంలో ఆశించే మరో తెగులు వెర్రి తెగులు. ఆలస్యంగా వేసిన పంటల్లో ఇది అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.

Prevention of pests in sesame crop cultivation

Sesame Crop Cultivation : తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే మెట్టప్రాంతాల్లో  పంటగా నువ్వును సాగుచేస్తుంటారు. ఎర్లీ ఖరీఫ్ మే రెండవ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుతారు.  ప్రస్తుతం తెలంగాణా జిల్లాల్లో సాగవుతున్న నువ్వులో తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు. ఎర్లీ ఖరీఫ్ మే రెండవ పక్షం వరకు, లేట్ ఖరీఫ్ ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకొనే అవకాశం ఉంది.

అయితే, ఖరీఫ్ లో సాగుచేస్తే తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది.  ఇప్పటికే చాలా చోట్ల పలు తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వేరుకుళ్లు, కాండంకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మరో తెగులు ఆకుమచ్చ తెగులు. దీనినే ఆల్టర్నేరియా తెగులు అంటారు. మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజమ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. పంట దశలో కార్బండిజమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటిఅలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేయాలి.

పూత సమయంలో ఆశించే మరో తెగులు వెర్రి తెగులు. ఆలస్యంగా వేసిన పంటల్లో ఇది అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. నివారణకు మొథైల్ డెమటాన్ 2 మిల్లి లీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లి లీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బూడిద తెగులు ఇది ఆశించినప్పుడు లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడుతాయి. తరువాత ఆకులు మాడి రాలిపోతాయి. నివారణకు నీటిలో కరితే గంధకం 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పంట మొదటి దశనుండి కోత వరకు తెగుళ్ల పట్ల జాగ్రత్త వహించాలి. తెగుళ్లను గుర్తించిన వెంటనే సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు