Restoration of troubled lands
Restoration Of Troubled Lands : పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన భూములు చాలా అవసరం. అయితే తెలంగాణలో మంచి నేలలతో పాటు కొన్ని సమస్యాత్మక భూములు కూడా ఉన్నాయి. ఈ సమస్యలు కారణంగా రైతులు.. సుస్థిర అధికకోత్పత్తిని సాధింకలేకపోతున్నారు. ఈ సమస్యలున్న భూముల్లో అధిక దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన మేలైన యాజమాన్యం గురించి తేలియజేస్తున్నారు, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.
READ ALSO : Short Duration Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక వరి రకాలు
తెలంగాణలో వరి, నూనెగింజలు, ఉద్యాన పంటలు, కూరగాయలను అధిక విసీర్ణంలో సాగువుతాయి. ప్రస్తుతం ఖరీఫ్‌లో అనువైన పంటలు పండించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అయితే రైతులు అధిక దిగుబడులు కోసం.. రసాయనిక ఎరువులు, పురుగు మందులను మితిమీరి వాడుతున్నారు. దీంతో పంట భూములు నాణ్యత కోల్పోయి.. అనుకున్నంత దిగుబడులు సాధించలేక పోతున్నారు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
రాష్ట్రంలో 9 రకాల సమస్యాత్మక భూములు ఉన్నాయి. వీటిలో లోతు తక్కువ భూములు, తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు, గట్టిపొర భూములు, మాగాణిలో ఆరుతుడి భూములు ఉన్నాయి. అలాగే తీవ్రవాలు, తెల్లచౌడు, కారు చౌడు, ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలతో పాటు.. సల్ఫైడ్‌దుష్ర్పభావ నేలలు వంటివి సమస్యాత్మక భూములగా చెప్పుకోవచ్చు. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడులు సాధించాలంటే.. పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు గురించి సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.
రసాయనిక ఎరువులు తగ్గించి.. సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. అప్పుడే భూముల్లో షోషకాలు పెరిగి.. పంటకు బలం చేరుకుంది. మరోవైపు సమస్యాత్మక భూముల్లో.. చెరువుమట్టి, పశువుల ఎరువులను తోలించి.. దుక్కిలో కలియ దున్నాలి. దీంతో భూముల్లో పంటకు అందించే నాణ్యత పెరుగుతుంది. మరోవైపు ఆయా నేలలకు అనువైన పంటలను ఎంచుకుని సాగు చేస్తే.. అధిక దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుకు.. ఆ నేలకు విడదీయలేని అనుబంధమున్నది. కానీ, ఇబ్బడిముబ్బడిగా వాడుతున్న రసాయనిక ఎరువులతో ఆ భూమి సహజత్వాన్ని కోల్పోతున్నది. పంట ఉత్పత్తులు విషతుల్యమవుతుండగా, నేల ఆరోగ్యమే కాదు, మానవ ఆరోగ్యమూ దెబ్బతింటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేలతల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భూమి గుణం, దాని సారం తెలుసుకొని, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ.. సాగు చేస్తేనే ప్రతిఫలం వస్తుంది. నాణ్యమైన దిగుబడులు రావడంతోపాటు లాభాల బాట పట్టే అవకాశముంటుంది.