Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

ఎరపంటను ఎన్నిక చేసేటప్పుడు కొన్ని జగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎర పంటను పురుగు ఉనికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా చీడపురుగులను అకర్షించేదిగా మరియు ముఖ్యపంటను అన్ని దశల్లో కాపాడే విధంగా ఎరపంట ఉండాలి.

Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

How to Use Trap Crops as Decoys to Control Insect Pests

Crave Crops : అధిక దిగుబడినిచ్చే వంగడాలు సాగులోకి వచ్చిన తరువాత అధిక మోతాదులో ఎరువులను వాడడం వల్ల వంటలను ఆశించే చీడ వురుగుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీటి వల్ల రైతులు చీడవురుగులను నియంత్రించడానికి వివిధ రకాల వురుగు మందులను విచక్షణ రపొతంగా అవగాహన లోవంతో వినియోగిస్తున్నారు. అందువల్ల కొన్ని చీడవురుగులు క్రిమి నంహారక మందులకు తట్టుకునే శక్తిని నంతరించుకోవడం, వురుగు మందుల ప్రభావం వంట ఉత్పత్తుల నాణ్యతపైన, పర్యావరణం పైనా అధికంగా పడుతుంది. పురుగు మందులను వాడకుండా ఇతర వద్ధతుల ద్వారా చీడ వురుగులను నియంత్రించటానికి ఎరపంటల సాగు ఎంతగానో ఉపయోగపడుతుంది.

సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఎరపంటలు పెంచడం ద్వారా పురుగుల వల్ల, పురుగు మందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. కొన్ని రకాల పురుగులు కొన్ని పంటలను మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి ఆ పంటలను పురుగులను ఆకర్షించడానికి ఎరగా వాడాలి వీటినే ఎర పంట అంటారు. ఎర పంటలను వాడడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించవచ్చు.

ఎరపంటను ఎన్నిక చేసేటప్పుడు కొన్ని జగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎర పంటను పురుగు ఉనికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా చీడపురుగులను అకర్షించేదిగా మరియు ముఖ్యపంటను అన్ని దశల్లో కాపాడే విధంగా ఎరపంట ఉండాలి. ఎర పంటలను ముఖ్య పంటలో వేసినప్పుడు ఎరపంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

పత్తిపంటలో బంతిని ఎరపంటగా వేయటం ద్వారా శనగవచ్చ పురుగును నివారించుకోవచ్చు. పత్తిలో ఆముదం పంటను వేయటం ద్వారా పొగాకు లద్దె పురుగును నివారించవచ్చు. అలాగే పత్తిలో బెండను వేయటం ద్వారా మచ్చల కాయతొలుచు పురుగు, పచ్చదోమ, క్యాబేజీలో అవాలు ఎరపంటగా వేయటం ద్వారా డైమండ్ బ్యాక్, మొక్కజొన్నలో జొన్నను ఎరపంటగా వేయటం ద్వారా కాండం తొలుచు పురుగును, టమోటో లో బంతి వేయటం ద్వారా శనగపచ్చ పురుగు, టమోటో లో ఆముదం వేయటం ద్వారా పొగాకు లద్దె పురుగు, పొగాకులో ఆముదం ఎరపంటగా వేయటం ద్వారా పొగాకు లద్దె పురుగును నివారించుకోవచ్చు. ఈ తరహాలో పురుగులను ఆకర్షించే పంటలను సాగు చేయటం ద్వారా రైతులు వేసిన పంటకు పురుగుల వల్ల నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు.