Benefits of Deep Ploughs : వేసవి దుక్కులతో నేల సత్తువ.. భూసారం పరిరక్షణతో పాటు చీడపీడల నివారణ

యాసంగి కోతల తర్వాత చాలామంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. భూసారాన్ని తగ్గిస్తాయి.

Benefits of Deep Ploughs

Benefits of Deep Ploughs : దున్నకుండా సాగుచేస్తే.. కొయ్యకుండా పోతుంది.. అనేది తెలుగు నానుడి. ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే. విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. దుక్కి చేయకుండా వదిలేయడంవల్ల భూమి సత్తువ కోల్పోతుంది. చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. ముడి పోషకాలలోపం ఏర్పడి, తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సివస్తుంది. అందుకే.. రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

READ ALSO : Paddy Cultivation : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెరగనున్న వరిసాగు విస్తీర్ణం

యాసంగి కోతల తర్వాత చాలామంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాననీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాల వల్ల భూమి కోతకు గురవుతుంది.

READ ALSO : Redgram Varieties : ఖరీఫ్ కు అనువైన కంది రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకే భూమిని లోతుగా… అంటే 25-30 సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి. దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించటంతోపాటు, చీడపీడలకు సంబంధించిన ప్యూపా దశలను నివారించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్.

 

ట్రెండింగ్ వార్తలు