Benda cultivation : బెండసాగులో మేలైన యాజమాన్యం

బెండ సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం . తొలకరి పంటగా జూన్ నుంచి జులైవరకు విత్తుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలను ఎంచుకొని  సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చంటూ  తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, శ్రవంతి.

Okra Crop

Benda cultivation : కాలానుగుణంగా సంవత్సరం పొడవునా  కూరగాయలు పండించే రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకోగలగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా….స్ధిరమైన ఆదాయన్నిచ్చే పంటగా బెండ  రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ లో బెండ విత్తే రైతులు సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

ఇటీవలి కాలంలో వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే  రైతులకు లాభదాయకంగా మారింది.ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మర్కెట్ ఒడిదుడుకులకు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సకాలంలో తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండసాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని తీయవచ్చు.

READ ALSO : Korra Cultivation : అండు కొర్రల సాగులో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు

బెండ సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం . తొలకరి పంటగా జూన్ నుంచి జులైవరకు విత్తుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలను ఎంచుకొని  సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చంటూ  తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, శ్రవంతి.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

బెండ విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2,3రోజులకు ఒక కోతచొప్పున కోయాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైన కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది. ప్రతి కోతలోను ఎకరాకు 4 – 5క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది.

READ ALSO : Lady’s Finger Cultivation : బెండ సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులు

పంటకాలం 3 నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4-5 నెలల వరకు పంటకాలం పొడిగించి, అధిక దిగుబడి పొందవచ్చు. బెండ ధరల్లో మార్కెట్ ఒడిదుడుకులు వున్నా సరాసరిన కిలోకు 10-15 రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు. దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు 30 నుంచి50వేల నికరలాభం ఆర్జించే ఆవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు