Grass Cultivation : పాడిపశువులకోసం అధిక దిగుబడినిచ్చే పసుగ్రాసాలు ఇవే..

సూర్ నేపియర్ పసుగ్రాసాన్ని ఎక్కువ కాలం నిల్వచేసుకుని పశువులకు అందించేందుకు వీలుంటుంది. నేపియర్ గ్రాసాన్ని ముక్కులుగా కట్ చేసి టన్ను గ్రాసానికి 100కిలోల బెల్లం మడ్డి కలిపి సైలేజీగా నిల్వ చేసుకోవచ్చు.

Grass (2)

Grass Cultivation : పాడిపశువులు, జీవాల పోషణ ప్రస్తుత పరిస్ధితుల్లో రైతులకు భారంగా మారింది. ప్రధానంగా పశువులకు అవసరమైన మేతను సమకూర్చుకునేందుకే ఎక్కవ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈక్రమంలో పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన పసుగ్రాసాలను సాగు చేయటం ద్వారా అధిక పాల దిగుబడి పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడినిచ్చే పసుగ్రాసాలును సాగు చేయటం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశుపోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇటీవలికాలంలో సూపర్ నేపియర్, జూరి అనే రెండు పశుగ్రాసాలు పాడిరైతులకు, జీవాల పెంపకం దారులకు అందుబాటులో ఉన్నాయి. అధిక దిగుబడిని ఇవ్వటమేకాకుండా, బహువార్షిక ధాన్యపుజాతి పశుగ్రాసాలు కావటంతో పశువులకు పోషక విలువలతో కూడిన గ్రాసాన్ని అందించేందుకు వీలవుతుంది. సూపర్ నేపియర్ పశుగ్రాసంలో కాండం లావుగా ఉండి, ఆకులు మెత్తాగా ఉంటాయి. జూరి పశుగ్రాసం సన్నటి కాండంతో ఎక్కువ ఆకులు కలిగి ఉంటుంది.

సూర్ నేపియర్ పసుగ్రాసాన్ని ఎక్కువ కాలం నిల్వచేసుకుని పశువులకు అందించేందుకు వీలుంటుంది. నేపియర్ గ్రాసాన్ని ముక్కులుగా కట్ చేసి టన్ను గ్రాసానికి 100కిలోల బెల్లం మడ్డి కలిపి సైలేజీగా నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఆక్సోలేట్లు ఉన్నందున పశువుల్లో కాల్షియం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ గ్రాసం వాడే వారు అదనంగా కాల్షియాన్ని పశువులకు అందించాల్సి ఉంటుంది. జూరి గ్రాసం విషయానికి వస్తే గ్రాసం ముదరిపోకుండా చూసుకోవాలి. 35 రోజులకొకసారి గ్రాసాన్ని కత్తిరించుకోవాలి. గ్రాసం ముదిరితే పశువుల్లో జీర్ణ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.

గ్రాసాలను సాగు చేసే రైతులు పొలాన్ని బాగా కలియదున్నుకోవాలి. నేల సారవంతంగా మార్చుకుంటూ సేంద్రీయ విధానంలో గ్రాసాల సాగు చేపట్టేందుకు వీలుగా పొలంలో బోదెలు తయారు చేసుకోవాలి. బోదెల మధ్య 2 నుండి 3అడుగుల దూరం ఉండేలా చూసి గ్రాసానికి సంబంధించిన కణుపులను నాటుకోవాలి. అంతర గ్రాసాలుగా అలసంద, పిల్లిపెసర, పెసర వంటి గ్రాసాల్ని వేసుకుంటే కలుపు లేకుండా చూసుకోవచ్చు. జూరి గడ్డి విత్తనాలను పొలాన్ని మళ్ళుగా చేసుకుని వాటిలో విత్తనాలను ఇసుకతో కలిపి చల్లు కోవాలి. రెండు మూడు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తుతాయి. నెలరోజుల వ్యవధిలోనే జూరి గడ్డి కోతకు వస్తుంది.

ఈ రెండు రకాలను ఇటీవలికాలంలో పశుగ్రాసం కోసం రైతులు విరివిగా సాగుచేస్తున్నారు. ఒక్కసాటి నాటితే సుమారు 5సంవత్సరాల పాటు పశుగ్రాసాన్ని అందిస్తాయి. తగినంత నీటి సదుపాయం కల్పించటం మినహా రైతులు పెద్ద చేయాల్సింది ఏమిలేదు. సంవత్సరానికి 6నుండి 7సార్లు గ్రాసం కోతకు రావటంతోపాటు, ఏడాదికి సుమారు 200టన్నుల వరకు సూపర్ నేపియర్ గ్రాసాన్ని పొందవచ్చు. ఈగ్రాసంలో అధికపోషక విలువలు ఉండటంతో అధిక పాలదిగుబడి కూడా వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు