Cotton Crop : ప్రత్తి పంటలో చీడపీడలకు కారణమయ్యే తుత్తుర బెండ, వయ్యారిభామ! వీటి నివారణ ఎలగంటే?
ఈ మొండి జాతి కలువు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతులు ఈ కలుపును పూతకు రాక ముందే వీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి.
- Guntupalli Ramakrishna
- Published On : December 29, 2022 / 02:51 PM IST
Thuthura Benda, Vaiyaribhama causing pests in cotton crop! How to prevent these?
Cotton Crop : ప్రత్తి పంటలో రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, విండినల్లి, పేనుబంక వంటివి సమస్యాత్మకంగా మారాయి. వీటికి వ్రత్యామ్నాయ అవాసాలుగా కొన్ని మొక్కలు తోడ్పడుతున్నాయి. ప్రత్తి వంట లేనప్పుడు ఈ రసం పీల్చుపురుగులన్నీ పొలం గట్లు మీద ఉన్న తుత్తుర బెండ, వయ్యారిభామల మొక్కల మీద అవాసాలు ఏర్పరుచుకుని వృద్ధి చెందుతాయి. తామర పురుగులు, తెల్లదోమ పలు వైరస్ తెగుళ్ళకు వాహకాలుగా చెప్పవచ్చు. ప్రత్తిలో టుబాకో న్రీక్ వైరస్ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ప్రత్తి పైరులో మొక్కల తాలి దశలో కలుపు నివారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.. రైతాంగం అంతర కృషి ద్వారా వాటిని నివారిస్తున్నారు. అయితే గట్ల మీద ఉన్న కలుపు, పంట కాలం
మొత్తం పెరుగుతూనే వుంటాయి. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు అధిక విత్తనోత్పత్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏపుగా పెరిగే సామర్థ్యం ఉండటం వల్ల లక్షల్లో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు గాలి, నీరు ద్వారా సుదూరాల వరకు వ్యాప్తి చెంది మొక్కలు తిరిగి మొలకెత్తుతాయి. వీటికి నిద్రావస్థ కూడా దాదాపు 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది.
ప్రత్తి పంట విత్తిన తరువాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు పలు వాతావరణ ఒడిదుడుకులకు లోనవుతుంది. బెట్ట పరిస్థితుల్లో తామర పురుగులు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఎక్కువగా గట్లమీద ఉన్న తుత్తురబెండ , వయ్యారి భామ పంట మీదకు వస్తాయి. ఈ కలుపు మొక్కలను
నివారించడం ద్వారా, చాలా వరకు తామరపురుగులు మరియు పిండినల్లి వ్యాప్తిని అరికట్టవచ్చు.
పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు ;
పొలంలో జిగురు అట్టలను ఏర్పరచుకోవాలి. పంట తొలిదశలో వేప సంభందిత మందులను పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 30, &5, 60 రోజులకు కాండానికి మందుపూత పద్ధతిని పాటించాలి. రసం పీల్చే పురుగుల ఉనికి మరియు ఉధృతిని అనుసరించి విత్తిన 60 రోజుల తరువాత సిఫారసు చేసిన రసాయనాలను పిచికారీ చేయాలి.
ఈ మొండి జాతి కలువు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతులు ఈ కలుపును పూతకు రాక ముందే వీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి. రసాయనాల ద్వారా గట్ల మీద ఈ కలుపును నివారించటానికి లీటరు నీటికి 2 (గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ లేదా 80 శాతం పొడిమందును లేదా లీటరు నీటికి 5 గ్రా. అట్రాజిన్ 50 శాతం పొడి మందులతో ఏదో ఒకదాన్ని నీటిలో కలిపి పూతకు రాకముందే పిచికారీ చేయాలి.
ఈ కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు ప్రత్తి మొక్కల మీద పడకుండా జాగ్రత్తపడాలి. గట్లమీద తాలకరి వర్షాలు పడినవెంటనే కలుపు మొలవకుండానే లేదా అప్పుడే మొలిచిన కలుపును ప్రాధమిక దశలోనే నిర్మూలించడం చాలా అవసరం. ప్రత్తి పంటవేసిన పొలంలోనే కాకుండా చుట్టూ వున్న ప్రదేశాల్లో కూడా ఈ కలుపు మొక్కలను నివారించడం వల్ల పంటను కాపాడుకోవచ్చు. మంచి దిగుబడులు పొందవచ్చు.
