Making Biscuits With Snacks
Small Grains : హైటెక్ యుగంలో ప్రజలంతా బిజి బిజి అయిపోయారు .. ఉద్యోగ ,వ్యాపారాలతో ప్రజల జీవనశైలీ మారిపోయింది .. దింతో అందరూ ఫాస్ట్ ఫుడ్ బాటపట్టారు .. అయితే ఫాస్ట్ ఫుడ్ తింటున్న అనేకమంది, రోగాల భారీన పడి, నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల నుండి బయట పడేందుకు అందరి చూపు మిలెట్స్ పై పడింది . ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు, అందరూ.. చిరుదాన్యాల ఫుడ్ కి అలవాటు పడుతున్నారు . దీంతో మార్కెట్ లో మిలెట్స్ కి ఏర్పడిన డిమాండ్ ని ఉపయోగించుకొని, ఉపాది గా మార్చుకోవాలని సూచిస్తూ .. మహిళలకు ఉచిత శిక్షణ ను ఇస్తున్నారు ఆముదాల వలస శాస్త్ర వేత్తలు.
READ ALSO : Millets : పోషకాల లోపాన్ని నివారించే చిరుధాన్యాలు!
చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాలు తయారు చేయడంలో తెలుగు రాష్ట్రాలు వెనుకంజలో వున్నాయి. రుచికి అంతే లేదని తెలిసినా… ఫాస్ట్ ఫుడ్ లకు అలవాటుపడిన జనం, అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం రెడీమేడ్ ఫుడ్ తయారీలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో చాక్లెట్లు, బిస్కెట్లు ఇతర చిరుతిళ్ల తయారీ సులభంగా వుంది.
చిరుధాన్యాల వాడకం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిన నేపధ్యంలో వీటితో తయారైన రెడీమేడ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనే తయారుచేస్తే, గ్రామీణుల ఉపాధి అవకాశాలు మెరగవటంతోపాటు, రైతులకు కూడా మంచి ధర లభిస్తుంది. ఈ నేపధ్యంలో స్థానికి మహిళలకు చిరుధాన్యల ఉప ఉత్పత్తుల తయారిలో శిక్షణ ఇస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
READ ALSO : Processing Of Small Grains : చిరుధాన్యాల ప్రాసెసింగ్‌లో రైతులకు మెళకువలు!
చిరుధాన్యాల్లో ఇనుము, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా వుంటాయి. ఉపఉత్పత్తులను చేయడంతో, వీటిని పండించిన రైతులకు కూడా మంచి ధర లభించి, ఆర్ధికంగా నిలదొక్కుకును అవకాశం ఉంటుంది.
చిరుధాన్యాల లో ఉండే ప్రొటీన్లు విటమిన్లు, పీచు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా అవసరం. ప్రముఖ కంపెనీలు సైతం చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటే డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్థుతం వీటి వాడకం విస్తృతమైన నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తయారీ యూనిట్ లను మరింత విస్తరిస్తే, ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యే వీలుంది.