Processing Of Small Grains : చిరుధాన్యాల ప్రాసెసింగ్‌లో రైతులకు మెళకువలు!

ప్రాధమిక ప్రాసెసింగ్‌లో చేసినటువంటి ముడిసరుకును ఆహారంగా తీసుకోవచ్చు. పంట ప్రక్రియను సరళీకృతం చేయడానికి, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలను వండుటకు సిద్దంగా ఉన్న పదార్థాలను తయారు చేయుటను ద్వితీయ ప్రాసెసింగ్‌ అంటారు.

Processing Of Small Grains : చిరుధాన్యాల ప్రాసెసింగ్‌లో రైతులకు మెళకువలు!

Techniques for farmers in the processing of small grains!

Updated On : December 27, 2022 / 2:50 PM IST

Processing Of Small Grains : రైతులు పండించిన చిరుధాన్యాలను నేరుగా ఆహారంగా తీసుకోవటం కుదరదు. అందువల్ల ఈ చిరుధాన్యాలను ప్రాసెస్‌ చేసి అధిక ఆహార పదార్థాల తయారీకి అనుకూలంగా మారిస్తే వినియోగం గణనీయంగా పెరుగుతుంది. పంటకోత కోసిన తరువాత నాణ్యతలోను మరియు పరిమాణంలో తేడాలు రాకుండా ఉంచటమే ప్రాసెసింగ్‌ యొక్క ముఖ్య ఉద్దేశం. చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ ముఖ్యంగా రెండు పద్ధతుల్లో చేస్తారు. 1. ప్రాధమిక ప్రాసెసింగ్‌, 2. ద్వితీయ ప్రాసెసింగ్‌,

ప్రాధమిక ప్రాసెసింగ్‌ పద్ధతులు :

ప్రాధమిక ప్రాసెసింగ్‌లో ప్రధానంగా పనికిరాని వ్యర్థపదార్థాలు, రాళ్లు, తాలు గింజలను వేరుచేయడం, ధాన్యపు గింజల నుండి బియ్యంగా మార్చడం. పంటను కోసి నూర్చిన తరువాత వాటిని క్షీణిత లేకుండా సురక్షితంగా నిల్వచేయటానికి గింజల్లో తేమ శాతం 10-12 శాతం వచ్చే వరకు ఆరబెట్టాల్సి ఉంటుంది. చిరుధాన్యాలను శుభ్రపరచుట , గ్రేడింగుల మూలంగా ధాన్యంపైన దుమ్ముధూళి, రాళ్ళు , అవాంచిత ఇతర పదార్థాల తొలగించుట కోసం డి-స్టోనర్‌ ఉపయోగపడుతుంది. దీనిలో ప్రధాన భాగాలు ఆస్పిరేటర్‌ మరియు గ్రేదర్‌.

చిరుధాన్యాల గింజ యొక్కపొట్టు తీయుట :

చిరుధాన్యాల పొట్టులో శిలీంధ్రజనిత టాక్సిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. మరియు తినడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల దానిపై పొట్టును తీసి బియ్యంగా మార్చాలి. ఈప్రక్రియ సాంప్రదాయ పద్ధతుల్లో కష్టతరంగా ఉండేది. ప్రస్తుతం పొట్టుతీయడానికి గాను రాపిడి సూత్రంతో పనిచేసే అబ్రాసివ్‌ డి-హల్లర్‌, రబ్బర్‌ రోల్‌ షెల్లర్‌ అందుబాటులో ఉన్నాయి. రెండు స్టేజీల్లో తయారుచేయబడ్డ సెంట్రిఫుగల్‌ ఇంపెల్లర్‌ పొట్టును పొట్టును మరియు బియ్యాన్ని వేరుచేయుటకు వేర్వేరు బెట్లెట్లు మరియు అస్పిరేటర్ లు ఉన్నాయి.

పొట్టు తీయబడని ధాన్యంను గ్రేడర్‌ ద్వారా వేరు చేసి సెంట్రిపుగల్‌ డి-హల్లర్లో పోసి బియ్యంగా మార్చవచ్చు. చిరుధాన్యాల ప్రాధమిక ప్రాసెసింగ్‌ కొరకు డి-స్ట్రోనర్‌, డి-హల్లర్‌, గ్రేడర్‌ ఈ మూడు యూనిట్లను ౩-ఫేసు విద్యుత్‌ సహాయంతో సుమారు రూ. 8.25 లక్షల ఖర్చుతో సంయుక్తంగా ఉపయోగించినట్లు అయితే రైతు స్థాయిలో కుటీర పరిశ్రమగా నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది.

ద్వితీయ ప్రాసెసింగ్‌ :

ప్రాధమిక ప్రాసెసింగ్‌లో చేసినటువంటి ముడిసరుకును ఆహారంగా తీసుకోవచ్చు. పంట ప్రక్రియను సరళీకృతం చేయడానికి, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలను వండుటకు సిద్దంగా ఉన్న పదార్థాలను తయారు చేయుటను ద్వితీయ ప్రాసెసింగ్‌ అంటారు. చిరుధాన్యాల ద్వితీయ ప్రాసెసింగ్‌ ద్వారా మల్టీ గైన్‌ పిండి, రవ్వ, అటుకులు, బిస్కెట్లు మరియు కోల్ట్‌ ఎక్స్‌ ట్రూ డెడ్‌ వదార్ధాలను తయారు చేసుకోవచ్చు.

ఇటీవలి మధ్యకాలంలో చిన్న మరియు మధ్యంతర చిరుధాన్యాల ఆహార పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనిలో ప్రధానంగా ద్వితియ ప్రాసెసింగ్‌ చేసి తయారుచేయబడిన ష్లాక్స్‌ గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పండించిన చిరుధాన్యాలను, కళ్ళం మీద, ఎటువంటి విలువ జోడింపు లేకుండా దళారులకు అమ్మడం కంటే పైన పేర్కొన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యంత్రాల్లో తమ ఆర్థిక పరిస్ధితి అనుగుణంగా తక్కువ , మధ్యస్థ సామర్ధ్యం కలిగిన యంత్రాలను ఎంపిక చేసుకొని చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ చేసుకొని మార్కెటింగ్‌ చేసుకుంటే పండించిన పంటకు మంచి ధరలభిస్తుంది.