Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 250 పైగా ఉద్యోగాలతో జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చదువు కంప్లీట్ అయ్యి మంచి ఉద్యోగ అవకాశం(Job Mela) కోసం ఎదురుచూస్తున్నారా?

Mega Job mela on August 26th at NAC Training Center
Job Mela: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. చదువు కంప్లీట్ అయ్యి మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే అలాంటి వాళ్ళ కోసమే మెగా జాబ్ మేళా(Job Mela) జరుగనుంది. నరసరావుపేటలోని NAC శిక్షణా కేంద్రంలో ఆగస్టు 26వ తేదీన అంటే ఇవాళే జాబ్‌మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. కాబట్టి, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని నిర్వహక్కులు సూచించారు. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాలు కోసం 9160200652 నంబర్‌ని సంప్రదించవచ్చు.
సంస్థలు, ఖాళీల వివరాలు:
శ్రీ ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ లో 30 ఖాళీలు
రాపిడో లో 40 ఖాళీలు
AU చిన్న ఆర్థిక బ్యాంకు లిమిటెడ్ లో 20 ఖాళీలు
టీవీఎస్ ట్రైనింగ్ & సర్వీసెస్ లో 30 ఖాళీలు
కాల్గేట్-పామోలివ్ ఇండియా లిమిటెడ్ లో 30 ఖాళీలు
ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 30 ఖాళీలు
శ్రీ రామచంద్ర ఏజెన్సీస్ లో 20 ఖాళీలు
స్కిల్ క్రాఫ్ట్ లో 20 ఖాళీలు
ఇన్నోవ్‌సోర్సెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 20 ఖాళీలు
మాస్టర్ మైండ్స్ లో 30 ఖాళీలు ఉన్నాయి.