Intelligence Bureau: డిప్లమా అర్హతతో ఐబీలో జాబ్స్.. 394 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు మీకోసం

ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 394 IB జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (Intelligence Bureau) పోస్టులను భర్తీ చేయనుంది.

Intelligence Bureau: డిప్లమా అర్హతతో ఐబీలో జాబ్స్.. 394 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు, అర్హత, పూర్తి వివరాలు మీకోసం

Notification released for 394 posts in Intelligence Bureau

Updated On : August 26, 2025 / 11:39 AM IST

Intelligence Bureau: దేశభద్రతలో ప్రధాన పాత్ర పోషించే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో చేరాలని చాలా మంది కళలు కంటారు. అలాంటి వారి కళలను నిజం చేస్తూ తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 394 IB జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (Intelligence Bureau) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ.

RRB Recruitment: ఆర్ఆర్బీలో 368 ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం.. దరఖాస్తు, లాస్ట్ డేట్ వివరాలు

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీసీఏ (BCA), బీఎస్సీ (B.Sc), సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే UR, EWS, OBC కేటగిరీలలోని పురుష అభ్యర్థులకు అదనంగా రూ.650 చెల్లించాలి.