Homemade Fertilizer : జీవన ఎరువుల వాడకంతో మరిన్ని లాభాలు.. రైతాంగానికి శాస్త్రవేత్తల సలహాలు 

Homemade Fertilizer : వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి.

uses of homemade fertilizer and get more profits in india

Homemade Fertilizer : రసాయన ఎరువుల మితిమీరి వాడకంతో భూములు సారాన్ని కోల్పోతున్నాయి. ఫలితంగా ఉత్పత్తుల నాణ్యత క్షీణించి, వ్యవసాయం మనుగడను దెబ్బతీసే ప్రమాధ ఘంటికలు మోగుతున్నాయి. దీన్ని గుర్తించిన రైతాంగం ఇటీవలి కాలంలో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా , జీవన ఎరువుల వాడకాన్ని సాగులో భాగం చేసుకుంటున్నారు.  వివిధ పంటల్లో జీవన ఎరువుల వాడకం, ఉపయోగాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ , బయో ఎనర్జీ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా॥ త్రివేణి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు, రకరకాల రసాయనాలతో  భూమి కలుషితమై రానురాను నిస్సారంగా తయారవుతోంది.

ఈ విపరీత పరిణామాల నుంచి భూమి యెక్క ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు, రైతు వ్యవసాయంలో పెట్టే పెట్టుబడిని తగ్గించుకుని, సుస్థిరమైన వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఈ జీవన ఎరువులు తోడ్పడుతున్నాయి. కేవలం 100- రూపాయల ఖర్చుతో రసాయన ఎరువులను 15 నుండి 20 శాతం  తగ్గించుకుని, 15 నుండి 20 శాతం పంట దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది.

భాస్వరం ను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు నేలలో వేయటం వల్ల, భూమిలో ఎంజైములను, రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి , నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. అంతే కాకుండా సుక్ష్మపోషకాలతో కలిసి వున్న భాస్వరాన్ని విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి. భాస్వరం కరిగించే జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడి లాభాలను పొందవచ్చు.

అన్ని పంటల్లో ఈ జీవన ఎరువుల వాడుకోవచ్చు. ఈ ఎరువుల  కోసం సంప్రదించవలసిన చిరునామా  అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్, మైక్రోబయోలజి , బయోఎనర్జీ విభాగం, వ్యవసాయ కళాశాల, రాంజేద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నెం. 040-24015011.

Read Also : Dragon Fruit Farming : అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు

ట్రెండింగ్ వార్తలు