Vegetable Cultivation : కూరగాయల తోటల్లో పండుఈగ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Vegetable Cultivation : కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతోపాటు, సుదూరంగా వున్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు.
- Sreehari A
- Updated on- August 1, 2024 / 02:37 PM IST
Agri Scientist Ramprasad
Vegetable Cultivation : తీగజాతి కూరగాయలు సాగుచేసే రైతులకు పండు ఈగ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. పిందె దశనుండి కాయ తయారయ్యే దశ వరకు ఈ ఈగ ఆశించి తీవ్రనష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపధ్యంలో పండుఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతోపాటు, సుదూరంగా వున్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు. తరగని డిమాండ్ తో నిత్యావసర ఆహారంగా వున్న కూరగాయల గిరాకీ నానాటికీ పెరుగుతుండటంతో ప్రతి ఏటా వీటి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. శాశ్వత పందిర్ల ఏర్పాటుకు తోడైన ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
అయితే, తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండుఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ప్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరగింది. ఈ ఈగ ఆశించిన కాయలను మార్కెట్ కు తీసుకపోతే సరైన ధర రాదు. కాబట్టి ఏటా ఈ పండుఈగ బెడద వున్న ప్రాంతాల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి నిర్మూలించాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త, డా. రాం ప్రసాద్.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
