Snake in 104 Vehicle Steering : 104 వాహనంలో స్టీరింగ్ పైకి వచ్చిన పాము .. భయంతో దూకేసిన డ్రైవర్
104 వాహనంలో ఓ పాము కలకలం సృష్టించింది. వాహనం నడిపే డ్రైవర్ ని హడలెత్తించింది. వాహనం నడుపుతుండగా..సడెన్ గా పాము స్టీరింగ్ మీదకొచ్చింది. దీంతో భయంతో డ్రైవర్ వాహనంలోంచి దూకేశాడు.
- nagamani
- Published on- November 10, 2022 / 02:56 PM IST
: Snake in vehicle steering
Snake in 104 vehicle steering : 104 వాహనంలో ఓ పాము కలకలం సృష్టించింది. వాహనం నడిపే డ్రైవర్ ని హడలెత్తించింది. వాహనం నడుపుతుండగా..సడెన్ గా పాము స్టీరింగ్ మీదకొస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి..గుండె ఆగిపోయిందా?అనిపిస్తుంది కదూ..పాపం అదే జరిగింది 104 వాహనం నడిపే డ్రైవర్ పరిస్థితి. స్టీరింగ్ పైకి వచ్చిన పాముని చూసిన డ్రైవర్ కు పై ప్రాణాలు పైనే పోయాయి. అంతే వాహనం రన్నింగ్ లో ఉందని..బ్రేక్ వేసి ఆపాలని కూడా అనిపించలేదు. భయంతో వాహనం వదిలేసి అమాంతంగా డోరుతీసుకుని బయటకు దూకేశాడు. దీంతో అతని పరిస్థితి ఎలా ఉందో గానీ వాహనం మాత్రం కంట్రోల్ తప్పి..విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది…
ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం ప్రాంతంలో జరిగిందీ ఘటన. 104 వైద్యసేవ వాహనంలో పాము హల్ చల్ చేసింది. పత్తాడ గ్రామంలో వైద్య శిబిరానికి వెళ్తున్న సమయంలో 104 వాహనంలో పాము హడలెత్తించటంతో డ్రైవర్ వాహనంలోంచి దూకేశాడు. దీంతో వాహనం అదుపు తప్పి ఓ విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది. కానీ ఎటువంటి ప్రమాదం జరుగకపోవటం విశేషం.
