Bonda Uma On Visakha Land Scam : విశాఖలో రూ.40వేల కోట్ల భారీ భూకుంభకోణం, టీడీపీ నేత సంచలన ఆరోపణలు
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Naveen
- Updated on- October 11, 2022 / 07:03 PM IST
Bonda Uma On Visakha Land Scam : ఏపీలో రాజధాని ఫైట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య రాజధాని అంశం చిచ్చు రాజేసింది. ఏపీకి ఒక్కటే రాజధాని అదీ అమరావతే అని టీడీపీ నేతలు అంటుంటే.. ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు ఉంటాయని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తాజాగా టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
విశాఖపట్నంలో వైసీపీ నేతలు రూ.40వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బోండా ఉమ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న విలువైన భూములను తొలగించి కొట్టేశారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర మంత్రులు ఎందుకు దీనిపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు బోండా ఉమ.
”వైసీపీ నాయకులు ఏదైనా చేయగల సమర్థులు. కరప్షన్, స్కామ్ లు, మాఫియాలు గతంలో రన్ చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడూ అదే చేస్తున్నారు. వాళ్లదేమీ తప్పు లేదు. వాళ్లు ఎప్పుడూ మారలేదు. ప్రజలదే తప్పు. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఇవాళ చూస్తున్నారు. రూ.10వేల కోట్ల సెజ్ లు మాయం చేయడం, లేపాక్షి, వాన్ పిక్ చేయలేదా? బయ్యారం గనులు చేయలేదా?” అని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు బోండా ఉమ.
