CM Jagan Plane Technical Fault : సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.

jagan

CM Jagan plane technical fault : ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు.

వెంటనే తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరిగి గవ్నవరం ఎయిర్ పోర్టులో విమానాన్ని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

SpiceJet Plane Emergency Landing : స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కోసం నిర్వహించే సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి కాసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. కానీ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన ఢిల్లీ ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.